మంత్రి పదవి ఇవ్వలేదు.. నిధులూ రావడం లేదు.. రేవంత్‌ ప్రభుత్వంపై కోమటిరెడ్డి ఆగ్రహం

Telangana
Advertisement
  • మంత్రి పదవి ఇస్తామని చెప్పి మోసం చేశారని రాజగోపాల్‌రెడ్డి ఆవేదన
  • సీఎం, డిప్యూటీ సీఎంను కలిసినా నిధులు రావడం లేదని విమర్శ
  • నిధుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలాగా పోరాడాల్సి వస్తోందని వ్యాఖ్య
  • బిల్లులు చెల్లించక రోడ్డు పనులు నిలిచిపోతున్నాయని ఆరోపణ
  • అభివృద్ధి జరగకపోతే ఎమ్మెల్యే పదవిని వదులుకుంటానని ప్రకటన
Advertisement
తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి అడిగినా నియోజకవర్గానికి నిధులు రావడం లేదని వాపోయారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవిని సైతం త్యాగం చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో మరోసారి చర్చకు దారితీశాయి.

గట్టుప్పల్‌ మండలంలో పర్యటించిన సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవిపై మాట్లాడారు. పదవి ఇస్తామని చెప్పి మోసం చేశారని, అయినప్పటికీ మనసు చంపుకొని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తే ఎక్కడికో వెళ్లిపోతాననే ఉద్దేశంతోనే ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు.

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నిధుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలాగా పోరాడాల్సి వస్తోందన్నారు. రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని, దీంతో పనులు మధ్యలోనే నిలిచిపోతున్నాయని చెప్పారు. ప్రస్తుత పనులకే నిధులు ఇవ్వకపోతే కొత్త పనులు ఎలా చేపడతారని ప్రశ్నించారు. జీతాలు, రైతు భరోసా వంటి పథకాలకు నిధుల కేటాయింపులోనూ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు.

మునుగోడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి జరగకపోతే పదవులను పట్టుకుని వేలాడబోనని, అవసరమైతే ఎమ్మెల్యే పదవిని వదులుకోవడానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు. గతంలో తాను కష్టపడి గెలిపించిన పలువురు నేతలు తనను మోసం చేశారని ఆరోపించారు. ఎవరికీ భయపడేది లేదని, రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

రాజగోపాల్‌రెడ్డి తాజా వ్యాఖ్యలతో సీఎం రేవంత్‌రెడ్డితో ఆయనకు విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంలోనూ ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పాల్గొన్న సభకు రాజగోపాల్‌రెడ్డి హాజరుకావడంతో పరిస్థితులు సద్దుమణిగాయని కాంగ్రెస్‌ వర్గాలు భావించాయి. అయితే రేడియల్‌ రోడ్ల టెండర్ల వ్యవహారం మళ్లీ వివాదానికి కారణమైంది. తన కుటుంబానికి చెందిన కంపెనీని ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపిస్తూ ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకా? లేక సీఎం రేవంత్‌రెడ్డితో మరోసారి నేరుగా తలపడేందుకు సంకేతమా? అన్న చర్చ మొదలైంది. ఇటీవల నిధుల విషయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో, రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.
Advertisement

సంబంధిత వార్తలు

Komatireddy Rajgopal ReddyRevanth ReddyMunugode MLATelangana CongressCabinet MinistryDevelopment Funds

More Telugu News

హైదరాబాద్‌లో పాదయాత్రకు ముందు కాంగ్రెస్‌పై అమిత్‌ షా ఆసక్తికర పోస్ట్‌!

02 Nov, 16:07

బెంగళూరు ఆసుపత్రికి జగన్.. రాప్తాడు బాధితురాలికి పరామర్శ

02 Nov, 15:59

పల్లీలు తింటే అల్జీమర్స్‌ ముప్పు తగ్గుతుందా? తాజా అధ్యయనం ఏం చెబుతోంది?

02 Nov, 15:56

టూత్ బ్రష్ నుంచి తలగడ వరకు... ఈ వస్తువులు ఎప్పుడు మార్చాలో తెలుసా?

02 Nov, 15:54

ప్రకటనల స్థానంలో పోర్న్‌ వీడియోలు.. పలు దేశాల్లో డిజిటల్‌ బోర్డ్‌లు హ్యాక్‌!

02 Nov, 15:48

చంద్రబాబు వచ్చాక ఏపీని బీహార్‌లా మార్చేశారు: విడదల రజని

02 Nov, 15:38

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఏదో తెలుసా?

02 Nov, 15:35

రాప్తాడు ఉన్మాది ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల‌ కీలక ప్రకటన.. కాలు కోల్పోనున్న హేమంత్?

02 Nov, 15:27

యువ సంచలనాన్ని నిరుత్సాహపరుస్తున్నారు: టీమిండియాపై శ్రీకాంత్ అసంతృప్తి

02 Nov, 15:21

ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్‌.. పీఎఫ్‌ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే

02 Nov, 15:19

విటమిన్ బీ12 ఎందుకంత కీలకం? లోపిస్తే ఏం జరుగుతుంది?

02 Nov, 15:18

నటనలో 'బాద్‌షా'.. వ్యాపారంలోనూ 'కింగ్'.. షారుఖ్ ఆస్తుల విలువ రూ. 10,000 కోట్లు!

02 Nov, 15:04

48 ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

02 Nov, 15:02

హైదరాబాద్‌ చేరుకున్న అమిత్ షా.. చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం

02 Nov, 15:00

ఈ అర్ధరాత్రి తీరం తాకనున్న 'మురసు' తుపాను.. ఒంగోలుకు 170 కి.మీ దూరంలో కేంద్రీకృతం

02 Nov, 14:57
..More Telugu News