వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. 11న పార్టీని ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

Andhra
Advertisement
  • ఏపీలో తమ పార్టీ మూడో ప్రత్యామ్నాయ పార్టీ అవుతుందన్న విజయసాయిరెడ్డి
  • 11వ తేదీన పార్టీ ప్రకటనలో ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదని వ్యాఖ్య
  • అన్ని వర్గాలకు అధికారం కట్టబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టీకరణ
Advertisement
వైసీపీలో తాను తీవ్రమైన మనోవేదనకు గురైనట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ పార్టీ అవతరించబోతోందని ఆయన ప్రకటించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈనెల 11వ తేదీన కొత్త పార్టీ పేరును వెల్లడిస్తానని స్పష్టం చేశారు.

టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ తన పార్టీలో చేరడం సంతోషంగా ఉందని విజయసాయి రెడ్డి తెలిపారు. తన కొత్త పార్టీలో ఓవీ రమణ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. తామిద్దరం గతంలో టీటీడీ బోర్డులో కలిసి పనిచేశామని, ఆ అనుభవంతో పార్టీని ముందుకు తీసుకెళతామని అన్నారు. కాగా, ఓవీ రమణ టీడీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తాను విజయసాయి పార్టీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే, రమణను విజయసాయి తన పార్టీలోకి స్వాగతించారు.

ఇక, నవంబర్ 11వ తేదీ, 11 గంటల 11 నిమిషాలకు పార్టీని ప్రకటించడంపై వస్తున్న ట్రోల్స్‌పైనా విజయసాయి స్పందించారు. "పండితులు సూచించిన ముహూర్త బలం ప్రకారమే ఆ సమయాన్ని ఎంచుకున్నాం. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదు. ఎవరో భుజాలు తడుముకుంటే నేను ఏమీ చేయలేను" అని ఆయన వివరణ ఇచ్చారు. తాను మెంటార్‌గా ఉంటూ అన్ని వర్గాల వారికి అధికారం కట్టబెట్టేలా పనిచేస్తానని, ప్రజల ఆశీర్వాదంతో ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత అన్ని జిల్లాల నుంచి చేరికలు ఉంటాయని తెలిపారు.
Advertisement

సంబంధిత వార్తలు

Vijayasai ReddyYSRCPNew Political PartyAndhra Pradesh PoliticsOV RamanaThird Alternative AP

More Telugu News

హైదరాబాద్‌లో పాదయాత్రకు ముందు కాంగ్రెస్‌పై అమిత్‌ షా ఆసక్తికర పోస్ట్‌!

02 Nov, 16:07

బెంగళూరు ఆసుపత్రికి జగన్.. రాప్తాడు బాధితురాలికి పరామర్శ

02 Nov, 15:59

పల్లీలు తింటే అల్జీమర్స్‌ ముప్పు తగ్గుతుందా? తాజా అధ్యయనం ఏం చెబుతోంది?

02 Nov, 15:56

టూత్ బ్రష్ నుంచి తలగడ వరకు... ఈ వస్తువులు ఎప్పుడు మార్చాలో తెలుసా?

02 Nov, 15:54

ప్రకటనల స్థానంలో పోర్న్‌ వీడియోలు.. పలు దేశాల్లో డిజిటల్‌ బోర్డ్‌లు హ్యాక్‌!

02 Nov, 15:48

చంద్రబాబు వచ్చాక ఏపీని బీహార్‌లా మార్చేశారు: విడదల రజని

02 Nov, 15:38

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఏదో తెలుసా?

02 Nov, 15:35

రాప్తాడు ఉన్మాది ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల‌ కీలక ప్రకటన.. కాలు కోల్పోనున్న హేమంత్?

02 Nov, 15:27

యువ సంచలనాన్ని నిరుత్సాహపరుస్తున్నారు: టీమిండియాపై శ్రీకాంత్ అసంతృప్తి

02 Nov, 15:21

ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్‌.. పీఎఫ్‌ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే

02 Nov, 15:19

విటమిన్ బీ12 ఎందుకంత కీలకం? లోపిస్తే ఏం జరుగుతుంది?

02 Nov, 15:18

నటనలో 'బాద్‌షా'.. వ్యాపారంలోనూ 'కింగ్'.. షారుఖ్ ఆస్తుల విలువ రూ. 10,000 కోట్లు!

02 Nov, 15:04

48 ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

02 Nov, 15:02

హైదరాబాద్‌ చేరుకున్న అమిత్ షా.. చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం

02 Nov, 15:00

ఈ అర్ధరాత్రి తీరం తాకనున్న 'మురసు' తుపాను.. ఒంగోలుకు 170 కి.మీ దూరంలో కేంద్రీకృతం

02 Nov, 14:57
..More Telugu News