ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు

Andhra
Advertisement
  • జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రోకు జగన్ అభినందనలు
  • ఇది దేశ స్వావలంబనను బలోపేతం చేసే విజయమని వ్యాఖ్య
  • ఇస్రో శాస్త్రవేత్తల కృషి, మేధస్సు దేశానికి గర్వకారణమని ప్రశంస
Advertisement
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించి ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. ఇస్రో ప్రయోగం విజయవంతం కావడంపై వైసీపీ అధినేత జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

ఎక్స్ వేదికగా జగన్ స్పందిస్తూ... "ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు హృదయపూర్వక అభినందనలు. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ 'నావిక్' బలోపేతంలో ఈ ప్రయోగం కీలక మైలురాయి. అత్యాధునిక అంతరిక్ష సాంకేతికతలో దేశ స్వావలంబనను మరింత బలోపేతం చేసే విజయం ఇది" అని ఆయన పేర్కొన్నారు.

ప్రజలకు కీలక సేవలు అందించడంలో ఈ ఉపగ్రహం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు. "ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం, మేధస్సు, నిరంతర కృషి దేశానికే గర్వకారణం" అని ఆయన ప్రశంసించారు.

నిన్న రాత్రి శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 రాకెట్ ను ప్రయోగించారు. ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహంతో భారతదేశ నావిగేషన్ వ్యవస్థ మరింత పటిష్ఠం కానుంది.
Advertisement

సంబంధిత వార్తలు

YS Jagan Mohan ReddyISROGSLV F18 LaunchNVS 03 SatelliteNavIC Navigation SystemSriharikota

More Telugu News

బంగాళాఖాతంలో మరో తుపాను.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

31 Oct, 15:45

భారత్‌లో ఇళ్ల కొనుగోలుకు ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి.. టాప్‌-5 నగరాలివే!

31 Oct, 15:37

భారత మహిళా క్రికెట్‌కు 50 ఏళ్లు.. నాటి కష్టాలను గుర్తుచేసుకున్న శుభాంగి కులకర్ణి

31 Oct, 15:32

స్టార్‌లింక్‌ నియంత్రణ మస్క్‌ చేతుల్లో ఉండకూడదు.. నోబెల్‌ గ్రహీత కీలక వ్యాఖ్యలు

31 Oct, 15:25

‘ఐఫా’లో 12 అవార్డులతో సత్తా చాటిన ‘ధురంధర్‌’.. ఉత్తమ నటుడిగా రణ్‌వీర్ సింగ్

31 Oct, 15:21

విద్యార్థినిపై దాడి అమానుషం.. నిందితుడిని వదలొద్దు: పవన్ కల్యాణ్

31 Oct, 15:10

ఢిల్లీలో 'ఇండియా' కూటమి భారీ నిరసన.. తరలిరావాలని ప్రకాశ్ రాజ్ పిలుపు

31 Oct, 15:09

బంగ్లాదేశ్‌లో మళ్లీ భారత్‌ వ్యతిరేక నినాదాలు.. తారిఖ్‌ రెహ్మాన్‌ ప్రభుత్వంపై నిరసనలు

31 Oct, 15:08

రాప్తాడు ఘటన.. బాధితురాలి తల్లికి చంద్రబాబు ఫోన్

31 Oct, 14:48

జియో నుంచి సరికొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లు.. రూ.147కే అపరిమిత కాల్స్!

31 Oct, 14:42

ఉద్యోగులకు రెండు రోజుల వీక్లీ ఆఫ్‌.. ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన

31 Oct, 14:35

చిన్నారి చెల్లిని క్లాస్ రూములో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు: నారా లోకేశ్

31 Oct, 14:31

డబ్బును ఇలా విభజించి ఇన్వెస్ట్‌ చేయండి.. భవిష్యత్తుకు ఢోకా ఉండదు!

31 Oct, 14:16

ఒకప్పుడు ఫ్యాక్టరీలో సాధారణ కార్మికురాలు.. నేడు చైనాలోనే అత్యంత ధనిక మహిళ!

31 Oct, 14:12
..More Telugu News