ఎల్‌నినో ఎఫెక్ట్.. తాగునీటి కోసం రూ.120 కోట్లు.. మంత్రి సీతక్క కీలక నిర్ణయం
Advertisement
- ఎల్‌నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు
- నాలుగు జిల్లాల్లో సింగూరు ప్రత్యామ్నాయానికి రూ.120 కోట్లు
- ఇతర జిల్లాలకు ఒక్కోటి రూ.కోటి చొప్పున నిధులు
- బోరుబావులు, ట్యాంకర్లతో నీటి సరఫరాకు ఏర్పాట్లు
- స్థానిక నీటి వనరులను అందుబాటులో ఉంచాలని ఆదేశం
Advertisement
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాల కోసం రూ.120 కోట్లు కేటాయించినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఇతర జిల్లాల్లో తక్షణ అవసరాల కోసం ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున నిధులు ఆమోదించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై శనివారం ఉదయం మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాల్లో స్థానిక నీటి వనరులను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట బోరుబావులను అద్దెకు తీసుకోవడంతో పాటు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
చేతిపంపులు, సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ నీటి సరఫరా పథకాలు, బావులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మిషన్ భగీరథ సరఫరాకు అంతరాయం ఏర్పడే గ్రామాలు, భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. నీటి పొదుపు, ఎల్‌నినో ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఇటీవల హైదరాబాద్, మేడ్చల్, ఖమ్మం, యాదాద్రి తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని సీతక్క సూచించారు. తాగునీటి వనరుల వద్ద ఉన్న ఇంకుడు గుంతలు, మ్యాజిక్ పిట్లలోకి నీరు చేరేలా చూడాలని, నిర్మాణంలో ఉన్న పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.