స్కూల్‌లో దారుణం.. పదో తరగతి విద్యార్థినిపై చెట్లు కోసే మెషీన్‌తో పాశవిక దాడి!

Both States
Advertisement
  • రాప్తాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఘటన
  • పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి
  • బాలిక ముఖం, తల, వీపుపై తీవ్ర గాయాలు
  • అడ్డుకునేందుకు వెళ్లిన మరో విద్యార్థినికి గాయాలు
  • బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స
Advertisement
అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ వ్యక్తి చెట్లను కోసే ఎలక్ట్రిక్‌ రంపంతో దాడి చేశాడు. ఈ ఘటనలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.

పాఠశాలలోకి వచ్చిన నిందితుడు విద్యార్థినిపై ఒక్కసారిగా దాడికి పాల్పడినట్లు సమాచారం. ఆమెపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది. ఈ ఘటనతో పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు.

వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు, విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

స్కూల్‌లో కొన్ని మరమ్మతు పనులు జరుగుతున్నాయని హెడ్‌ మాస్టర్‌ తెలిపారు. నిందితుడు స్కూల్లోకి వస్తున్న సమయంలో ఉపాధ్యాయులు గమనించినప్పటికీ.. వర్కర్‌ అనుకున్నామని వెల్లడించారు. ఘటన జరిగినప్పుడు తరగతి గదిలో టీచర్‌ ఉన్నట్లు తెలిపారు. దాడి చేసిన వ్యక్తికి 25-30 ఏళ్ల వయసు ఉండొచ్చని అంచనా వేశారు. సరిగా గమనించే లోపే ఉన్మాది పారిపోయినట్లు పేర్కొన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Anantapur School AttackRaptadu government school10th class student attackedWood cutting machine attackAnantapur crime newsAndhra Pradesh school safety

More Telugu News

కర్నూలులో ఓ వ్యక్తి ఇంట్లో రూ.76 లక్షల నగదు సీజ్!

31 Oct, 13:55

ఏపీ వ్యాప్తంగా ప్రారంభమైన ఎన్నికల సామగ్రి పంపిణీ.. రేపే పోలింగ్

31 Oct, 13:48

ఫిన్లాండ్‌లో గూగుల్ నిర్వాకం.. అడవిని నరికివేయ‌డంతో ఊళ్లపై పడుతున్న తోడేళ్లు!

31 Oct, 13:44

వన్డేల్లో జడేజా కథ ముగిసినట్టేనా? పుజారా కీలక వ్యాఖ్యలు

31 Oct, 13:39

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తాగునీటి కోసం రూ.120 కోట్లు.. మంత్రి సీతక్క కీలక నిర్ణయం

31 Oct, 13:39

ఐదో బిడ్డ కావాలన్న జేడీ వాన్స్.. అర్ధాంగి ఉష నుంచి ఊహించని వార్నింగ్!

31 Oct, 13:21

రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశం

31 Oct, 13:11

బాత్రూమ్‌లో జారిపడి తలకు గాయం.. ప్రముఖ దర్శకుడు మృతి

31 Oct, 13:08

ఏపీకి ఎస్‌బీఐ ఆపన్నహస్తం.. రూ. 5 కోట్ల భారీ విరాళం

31 Oct, 13:03

తెలంగాణకు ఐదు రోజుల వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో వార్నింగ్

31 Oct, 12:55

ఫోన్‌లో డాక్యుమెంట్లు పెడుతున్నారా?.. ఈ తప్పులు అస్సలు చేయకండి!

31 Oct, 12:40

అమరావతికి చేరుకున్న కేంద్ర బృందం.. ఆర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష

31 Oct, 12:36

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఫ్యాక్టరీలో నలుగురు సజీవ దహనం

31 Oct, 12:29

హైదరాబాద్‌లో హైడ్రా చర్యలు.. రామాంతపూర్ పెద్ద చెరువు వద్ద కూల్చివేతలు

31 Oct, 12:25
..More Telugu News