జీహెచ్ఎంసీ తీరుపై హైకోర్టు ఆగ్రహం.. కూల్చివేతలపై ప్రశ్నల వర్షం
Advertisement
- నిర్మాణాలపై జీహెచ్ఎంసీ వైఖరిపై హైకోర్టు ఆగ్రహం
- అనుమతులిచ్చి, క్రమబద్ధీకరించి మీరే కూల్చేస్తారా? అని ప్రశ్న
- మల్కాజ్‌గిరి డిఫెన్స్ హౌసింగ్ సొసైటీ కేసులో తీవ్ర వ్యాఖ్యలు
- కౌంటర్లు దాఖలు చేసేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రాకు తుది గడువు
Advertisement
‘నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించడం మీరే చేసి, ఇప్పుడు మళ్లీ వాటిని కూల్చివేయమని అడగడమేంటి?’ అంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భవన నిర్మాణ అనుమతులు, కూల్చివేతల విషయంలో జీహెచ్ఎంసీ వైరుధ్యపూరిత వైఖరిని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
మల్కాజిగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డిఫెన్స్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన వివాదంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సొసైటీ పరిధిలోని ప్లాట్లలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలను సవాల్ చేస్తూ నర్సింహారెడ్డి తదితరులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, సొసైటీకి చెందిన 6,039 చదరపు గజాల స్థలంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ నిర్మించి, వాహనాలు పార్క్ చేస్తోందని సొసైటీ మరో పిటిషన్ వేసింది.
జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ ఈ కేసును విచారించారు. తమ వద్ద అన్ని అనుమతులు ఉన్నాయని, లేఅవుట్ కూడా క్రమబద్ధీకరించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, లేఅవుట్లను క్రమబద్ధీకరించిన తర్వాత, అందులోని ప్రజా వినియోగ స్థలాలను కాపాడాలని రెవెన్యూ, హైడ్రా శాఖలకు జీహెచ్ఎంసీ లేఖలు రాయడమేమిటని ప్రశ్నించారు. తమ సొంత స్థలంలోని నిర్మాణాలను తొలగించుకోకుండా, రెవెన్యూ శాఖను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందని జీహెచ్ఎంసీని నిలదీశారు.
ఈ నేపథ్యంలో, కౌంటర్లు దాఖలు చేసేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రాలకు చివరి అవకాశంగా మూడు వారాల గడువు ఇస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.