నాకు ఎలాంటి అధికారిక ఫ్యాన్ క్లబ్ లేదు: సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్

Entertainment
Advertisement
  • తనకు ఎలాంటి అధికారిక ఫ్యాన్ క్లబ్ లేదని స్పష్టం చేసిన జాసన్ సంజయ్
  • సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలతో జాగ్రత్తగా ఉండాలని సూచన
  • తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాల వెల్లడి
  • ఇటీవల 'సిగ్మా' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వైనం
Advertisement
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కుమారుడు, యువ దర్శకుడు జాసన్ సంజయ్ తన అభిమాన సంఘాలపై కీలక ప్రకటన చేశాడు. తనకు ఎటువంటి అధికారిక ఫ్యాన్ క్లబ్‌లు లేవని, తన పేరుతో కొనసాగుతున్న ఏ సంఘాన్నీ తాను గుర్తించలేదని సోషల్ మీడియా వేదికగా ఆయన స్పష్టం చేశాడు.

ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో.. "మేము ఎటువంటి అధికారిక ఫ్యాన్ క్లబ్, అసోసియేషన్ లేదా కమ్యూనిటీ గ్రూపులను ప్రారంభించలేదు, గుర్తించలేదు. 'అధికారిక ఫ్యాన్ క్లబ్' లేదా 'అధీకృత కమ్యూనిటీ' అని చెప్పుకునే ఏ గ్రూపులైనా పూర్తిగా అనధికారికమైనవి, వాటికి మా ఆమోదం లేదు" అని పేర్కొన్నాడు. తన పేరుతో ఉన్న నకిలీ ఖాతాలు, పేజీల కంటెంట్‌కు లేదా వాటి చర్యలకు తనకు ఎటువంటి సంబంధం లేదని, వాటికి తాను బాధ్యత వహించబోనని ఆయన తేల్చిచెప్పాడు.

అదే సమయంలో, తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను ఆయన వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్ (jason.sanjay_official), ఫేస్‌బుక్ (Jason Sanjay), ఎక్స్ (Jason Sanjay Official - x.com/official_jsj) మాత్రమే తన అధికారిక ఖాతాలని స్పష్టం చేశాడు.

జాసన్ సంజయ్ ఇటీవల 'సిగ్మా' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ అక్టోబర్ 2న విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు తాను ఉత్సాహంతో పాటు కొంత ఆందోళనగా ఉన్నట్లు జాసన్ పేర్కొన్నాడు.
Advertisement

సంబంధిత వార్తలు

Jason SanjayThalapathy Vijay sonSigma movie directorJason Sanjay fan clubsSundeep KishanTamil Nadu CM Vijay

More Telugu News

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా!

30 Oct, 11:21

క్రిప్టో మార్కెట్‌లో కలకలం.. బైనాన్స్‌పై సైబర్‌ దాడి.. డిపాజిట్లు, విత్‌డ్రాల నిలిపివేత

30 Oct, 11:20

గందరగోళానికి తెర.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు విశాఖపట్నం పేరు!

30 Oct, 11:01

ముంబై ఇండియన్స్‌లో భారీ మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప!

30 Oct, 10:59

సర్జరీ తర్వాత 111 నిమిషాల సింగిల్ షాట్.. సీఐడీ డైరెక్టర్ రికార్డును తెలిపిన నటుడు

30 Oct, 10:57

టీమిండియాకు బిగ్‌ షాక్‌.. న్యూజిలాండ్‌ సిరీస్‌కు స్టార్‌ పేసర్‌ ఔట్‌!

30 Oct, 10:54

సినిమా సెట్ ను తలపించే రైల్వే స్టేషన్.. చూస్తే వావ్ అనాల్సిందే!

30 Oct, 10:50

పేదరికంపై భారత్ గెలుపు.. ప్రపంచ బ్యాంకు ప్రశంసలు

30 Oct, 10:48

అమెరికా జనాభాలో భారతీయులు ఎంత మంది ఉన్నారో తెలుసా?

30 Oct, 10:46

నవంబర్ 1 ర్యాలీ వాయిదా వేయండి.. సోనియా గాంధీకి ఢిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి

30 Oct, 10:37

బాణసంచా వద్దు.. ప్రచారానికి కోహ్లీని రంగంలోకి దించండి: సుప్రీంకోర్టు

30 Oct, 10:25

ఇంద్రవెల్లిలో నేడు కవిత ‘పాంచజన్య సంకల్ప సభ’.. భారీ ఏర్పాట్లు

30 Oct, 10:23

న్యూజిలాండ్ గడ్డపై కోహ్లీ క్రేజ్... ఎయిర్‌పోర్ట్‌లో సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్

30 Oct, 10:19

గూగుల్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఒక్కరోజే రూ.47ల‌క్ష‌ల కోట్లు నష్టం.. చరిత్రలోనే అతిపెద్ద పతనాల్లో ఒకటి!

30 Oct, 10:13

ఉపవాసంతో ఆరోగ్యం మెరుగవుతుందా? ఎక్కువసేపు పస్తులుంటే ఏమవుతుంది?

30 Oct, 10:05
..More Telugu News