అర్నాబ్ తుపాను బీభత్సం: ఉగ్రరూపం దాల్చిన బాహుదా.. స్తంభించిన ఏపీ-ఒడిశా రవాణా!
Advertisement
- అర్నాబ్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వరదలు
- ఉగ్రరూపంలో ప్రవహిస్తున్న బాహుదా, వంశధార నదులు
- ఏపీ-ఒడిశా మధ్య పూర్తిగా నిలిచిపోయిన రోడ్డు, రైలు రవాణా
- శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నీట మునిగిన వందలాది గ్రామాలు
- వేలాది హెక్టార్లలో పంట నష్టం, కొట్టుకుపోయిన కొబ్బరి తోటలు
Advertisement
'అర్నాబ్' తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర ప్రాంతం అతలాకుతలమవుతోంది. ఒడిశాతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా బాహుదా నది ఉగ్రరూపం దాల్చడంతో ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, సువర్ణముఖి, వేగావతి నదులు కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
బాహుదా నదిలోకి ఏకంగా 86,458 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. గొట్టా బ్యారేజ్ వద్ద వంశధార నది ప్రవాహం 73,324 క్యూసెక్కులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ వరదల కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, మందస, పాతపట్నం నియోజకవర్గాలతో పాటు పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
వరద ఉద్ధృతికి రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఇచ్ఛాపురం లొద్దపుట్టి వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇచ్ఛాపురం-జడుపూడి మధ్య రైల్వే ట్రాక్‌లు, వంతెన దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు, గాలికొండ వద్ద కొండచరియలు విరిగిపడటంతో అరకు-విశాఖ ఘాట్ రోడ్డును మూసివేశారు. బొర్రా-కారకవలస స్టేషన్ల మధ్య ట్రాక్ దెబ్బతినడంతో కొత్తవలస-కిరండూల్ ప్యాసింజర్ రైలును నవంబర్ 3 వరకు రద్దు చేశారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం, ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 728 గ్రామాల్లో సుమారు 21,590 హెక్టార్లలో వరి పంట, 383 హెక్టార్లలో ఉద్యాన పంటలు ధ్వంసమయ్యాయి. బారువ వద్ద తీరప్రాంత కోత కారణంగా కొబ్బరి తోటలు సముద్రంలో కలిసిపోయాయి. సోంపేట-బారువ రహదారిలో సుమారు 7 కిలోమీటర్ల మేర పొలాల్లో 10 అడుగుల లోతున నీరు నిలిచిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.