తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
Advertisement
- ఏపీని అతలాకుతలం చేసిన అర్నాబ్ అతి తీవ్ర తుఫాన్
- కోస్తాంధ్ర అతలాకుతలం.. రేపటి నుంచి సీఎం క్షేత్రస్థాయి పర్యటన
- తుపాను నష్టంపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు
Advertisement
'అర్నబ్' తుపాను ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. తీవ్రమైన ఈదురుగాలులు, కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించింది. కోనసీమ, కాకినాడ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తుపాను ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు వేలాది విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు 70 వేల హెక్టార్లలో వరి పంట, 10 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రోడ్లు ధ్వంసమై, రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది.
తుపాను నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తక్షణమే రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు బియ్యం, నిత్యావసరాలతో కూడిన సహాయ ప్యాకేజీని అందించనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు ముఖ్యమంత్రి రేపు, ఎల్లుండి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. బాధితులను పరామర్శించి, పునరుద్ధరణ పనులను స్వయంగా పర్యవేక్షించనున్నారు.