రూ.1,500తో ఏడాది టోల్‌ ప్రయాణాలు.. ఎవరికి వర్తిస్తుందంటే?

Business
Advertisement
  • ఫాస్టాగ్‌ వార్షిక లోకల్‌ పాస్‌కు కేంద్రం ఆమోదం
  • నవంబర్‌ 1 నుంచి కొత్త పాస్‌ అమల్లోకి
  • టోల్‌గేట్‌ వెలుపల ఉంటే ఏడాదికి రూ.1,500
  • పట్టణ పరిధిలోని టోల్‌గేట్‌కు రూ.3,000
  • టోల్‌ ప్లాజాకు 20 కి.మీ. పరిధిలో నివాసం ఉండాలి
Advertisement
టోల్‌గేట్ల మీదుగా తరచూ ప్రయాణించే స్థానికులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. జాతీయ రహదారుల టోల్‌ ప్లాజాల సమీపంలో నివసించే ప్రైవేటు వాహనదారుల కోసం వార్షిక ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ను తీసుకొచ్చింది. టోల్‌ ప్లాజా ఉన్న ప్రాంతాన్ని బట్టి ఏడాదికి రూ.1,500 లేదా రూ.3,000 చెల్లిస్తే సరిపోతుంది. ఈ కొత్త విధానం నవంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. 

ఎవరు అర్హులు?
టోల్‌ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రైవేటు వాహన యజమానులు ఈ పాస్‌కు అర్హులు. వాహనానికి చెల్లుబాటయ్యే, పనిచేస్తున్న నాన్‌ కమర్షియల్‌ ఫాస్టాగ్‌ ఉండాలి. అయితే ఈ అర్హతలు ఉన్నంత మాత్రాన పాస్‌ వస్తుందని భావించకూడదు. సర్వీస్‌ రోడ్డు లేదా ప్రత్యామ్నాయ రహదారి అందుబాటులో ఉన్న టోల్‌ ప్లాజాల వద్ద ఈ రాయితీ వర్తించదు. క్లోజ్డ్‌ టోల్‌ వసూలు విధానం ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపైనా ఈ పాస్‌ వర్తించదు. 

టోల్‌ ప్లాజా ఎక్కడ ఉంది? పాస్‌ ధర ఎంత?
టోల్‌ ప్లాజా మున్సిపల్‌ లేదా స్థానిక పట్టణ పరిధి వెలుపల ఉంటే ఏడాదికి రూ.1,500 చెల్లించాలి. ఆ పరిధిలో ఉంటే రూ.3,000 కట్టాలి. ఈ పాస్‌ తీసుకున్న టోల్‌ ప్లాజా వద్ద మాత్రమే ఉపయోగించుకోవచ్చు. మరో టోల్‌గేట్‌ వద్దకు మార్చుకోవడం కుదరదు. ఇప్పటికే ఉన్న నెలవారీ పాస్‌ విధానాన్ని కూడా వాహనదారులు ఎంచుకోవచ్చు. 

ఎలా పొందాలి?
నవంబర్‌ 1 నుంచి అర్హత ఉన్న టోల్‌ ప్లాజాల వద్ద ఈ వార్షిక పాస్‌ అందుబాటులోకి వస్తుంది. డిసెంబర్‌ 1 నుంచి రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌ ద్వారా కూడా పొందవచ్చు. ఈ పాస్‌ కోసం దరఖాస్తు చేసే ముందు తమ నివాసం నిర్దేశిత 20 కిలోమీటర్ల పరిధిలో ఉందో? లేదో? తాము ప్రయాణించే టోల్‌ ప్లాజాకు రాయితీ వర్తిస్తుందో? లేదో? నిర్ధారించుకోవాలి.
Advertisement

సంబంధిత వార్తలు

Central GovernmentFASTag Local PassToll Plaza DiscountNational HighwaysAnnual Toll PassRajmargyatra App

More Telugu News

చదవడానికి కూర్చుంటే ఫోన్‌ చూస్తున్నారా? ఈ చిట్కాలతో ఏకాగ్రత పెంచుకోండి!

28 Oct, 21:14

పైన బుల్లెట్ ట్రైన్.. కింద సాధారణ రైళ్లు.. అహ్మదాబాద్‌లో రైల్వే అద్భుతం!

28 Oct, 21:07

‘జ్ఞానేశ్‌ కుమార్‌ దిగిపోవాలి’.. ఇండియా కూటమి ర్యాలీకి ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ మద్దతు!

28 Oct, 21:01

ఆ సమయంలో అతడి సినిమాలే నాకు ఉపశమనం: రోహిత్ శర్మ

28 Oct, 20:32

‘ప్రతిచోటా దెయ్యాలే కనిపిస్తున్నాయా?’.. రాహుల్‌కు నిర్మల ఘాటు కౌంటర్‌

28 Oct, 20:32

తుపాను బాధితులకు భారీ ప్యాకేజి ప్రకటించిన చంద్రబాబు.. ఎవరికి ఎంత.. పూర్తి వివరాలు ఇవిగో!

28 Oct, 20:14

ఇంట్లోనే సినిమా హాలు.. ఎల్‌జీ కొత్త టీవీ ధర, ఫీచర్లు ఇవే!

28 Oct, 20:13

పులివెందుల ఓటమిని జీర్ణించుకోలేకే జగన్ సవాళ్లు: మంత్రి సత్యకుమార్

28 Oct, 20:10

‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయిపల్లవి వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో చర్చ!

28 Oct, 19:49

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

28 Oct, 19:43

తుపాను వేళ ఏపీకి అండగా తెలంగాణ ప్రభుత్వం.. సాయానికి సిద్ధమన్న భట్టి

28 Oct, 19:39

అమ్మాయిలు అదరహో.. జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్

28 Oct, 19:33

రూ.200 కూపన్‌తో రూ.50 లక్షల కారు.. ఆరేళ్ల బాలుడికి అదృష్టం!

28 Oct, 19:23

ఏఐ ప్రమాదకరం: డీప్ ఫేక్ వీడియోలపై కృతి సనన్ పోరాటం

28 Oct, 18:56
..More Telugu News