రూ.200 కూపన్‌తో రూ.50 లక్షల కారు.. ఆరేళ్ల బాలుడికి అదృష్టం!

Offbeat
Advertisement
  • ఆరేళ్ల మేధాంశ్ కు రూ.50 లక్షల ఫార్చ్యూనర్‌ కారు
  • రూ.200తో బామ్మ కొనుగోలు చేసిన కూపన్‌తో బహుమతి
  • మేధాంశ్ మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌ వాసి
  • ఆభాపురిలో లక్కీ డ్రా నిర్వహణ
  • రెండేళ్లుగా కారు కొనాలనుకుంటున్న కుటుంబం.. కల నెరవేరిన వైనం
Advertisement
కేవలం రూ.200 పెట్టి కొనుగోలు చేసిన లక్కీ డ్రా కూపన్‌.. ఏకంగా రూ.50 లక్షల విలువైన కారును గెలుచుకునేలా చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆరేళ్ల బాలుడికి ఈ అరుదైన అదృష్టం వరించింది. అతడి పేరు మేధాంశ్ రైక్వార్‌. బుర్హాన్‌పూర్‌లోని సీలంపురాకు చెందిన ఈ చిన్నారి టయోటా ఫార్చ్యూనర్‌ కారును గెలుచుకున్నాడు. బామ్మ కొనుగోలు చేసిన కూపన్‌ అతడి కుటుంబానికి ఈ అనూహ్యమైన ఆనందాన్ని తీసుకొచ్చింది. 

మేధాంశ్ బామ్మ కిరణ్‌ రైక్వార్‌ ఏడాది క్రితం ఆభాపురిలో జరిగిన గర్బా వేడుకలకు వెళ్లారు. అక్కడ రూ.200తో లక్కీ డ్రా కూపన్‌ కొనుగోలు చేశారు. దానిపై తన మనవడి పేరు రాశారు. ఆ కూపన్‌ తమ కుటుంబానికి ఇంత పెద్ద బహుమతిని తెచ్చిపెడుతుందని ఆమె అప్పట్లో ఊహించలేదు.

2026లో శ్రీ సర్కార్‌ ధామ్‌ నిర్వహించిన లక్కీ డ్రా ఫలితాలు ప్రకటించగా.. తొలి బహుమతి మేధాంశ్ పేరుపై వచ్చింది. దీంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. సుమారు రూ.50 లక్షల విలువైన ఫార్చ్యూనర్‌ కారు సొంతం కావడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. 

ఈ కుటుంబం రెండేళ్లుగా సొంత కారు కొనుక్కోవాలని ఆశపడుతోంది. అనూహ్యంగా లక్కీ డ్రాలో కారు రావడంతో ఆ కల నెరవేరింది. మేధాంశ్ కు స్థానికులు, బంధువులు ఘన స్వాగతం పలికారు. డప్పుల మోతల మధ్య సంబరాలు చేసుకున్నారు. కొత్త కారుకు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి, దేవుడి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Advertisement

సంబంధిత వార్తలు

Medansh RaikwarToyota FortunerLucky Draw WinnerMadhya Pradesh BoyShri Sarkar DhamBurhanpur News

More Telugu News

ఆ సమయంలో అతడి సినిమాలే నాకు ఉపశమనం: రోహిత్ శర్మ

28 Oct, 20:32

‘ప్రతిచోటా దెయ్యాలే కనిపిస్తున్నాయా?’.. రాహుల్‌కు నిర్మల ఘాటు కౌంటర్‌

28 Oct, 20:32

తుపాను బాధితులకు భారీ ప్యాకేజి ప్రకటించిన చంద్రబాబు.. ఎవరికి ఎంత.. పూర్తి వివరాలు ఇవిగో!

28 Oct, 20:14

ఇంట్లోనే సినిమా హాలు.. ఎల్‌జీ కొత్త టీవీ ధర, ఫీచర్లు ఇవే!

28 Oct, 20:13

పులివెందుల ఓటమిని జీర్ణించుకోలేకే జగన్ సవాళ్లు: మంత్రి సత్యకుమార్

28 Oct, 20:10

‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయిపల్లవి వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో చర్చ!

28 Oct, 19:49

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

28 Oct, 19:43

తుపాను వేళ ఏపీకి అండగా తెలంగాణ ప్రభుత్వం.. సాయానికి సిద్ధమన్న భట్టి

28 Oct, 19:39

అమ్మాయిలు అదరహో.. జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్

28 Oct, 19:33

రూ.1,500తో ఏడాది టోల్‌ ప్రయాణాలు.. ఎవరికి వర్తిస్తుందంటే?

28 Oct, 19:28

ఏఐ ప్రమాదకరం: డీప్ ఫేక్ వీడియోలపై కృతి సనన్ పోరాటం

28 Oct, 18:56

ఇంగ్లండ్ ఆటగాడితో వాగ్వాదం.. పాక్‌ బౌలర్‌కు భారీ జరిమానా.. ఇంకోసారి జరిగితే నిషేధమే!

28 Oct, 18:53

ధోనీని తొలగించి స్మిత్ కు కెప్టెన్సీ.. ఆ నిర్ణయంతో అందరం షాకయ్యాం: డుప్లెసిస్

28 Oct, 18:31

పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలోకి 20 కుటుంబాలు

28 Oct, 18:31
..More Telugu News