తుపాను ప్రభావం తగ్గే వరకు క్షేత్ర స్థాయి విధుల్లోనే ఉండాలి: అధికారులకు పవన్ ఆదేశం

Andhra
Advertisement
  • అర్నబ్ తుపాను సహాయక చర్యలపై జిల్లాల కలెక్టర్లతో పవన్ కళ్యాణ్ సమీక్ష
  • సహాయ చర్యలు వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు
  • విద్యుత్, రహదారులను వెంటనే పునరుద్ధరించాలని సూచన
  • కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని నష్టంపై ప్రత్యేకంగా ఆరా తీసిన పవన్ కల్యాణ్
  • గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు.. పలు జిల్లాల్లో భారీగా ఆస్తి, పంట నష్టం
Advertisement
అర్నబ్ తీవ్ర తుపాను తీరం దాటిన నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం మొత్తం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, తుపాను ప్రభావం పూర్తిగా తగ్గేంత వరకు అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బాపట్ల నుంచి శ్రీకాకుళం వరకు తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో బుధవారం మధ్యాహ్నం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని ఆదేశించారు.

ముఖ్యంగా తుపాను తీరం దాటిన డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది పరిసరాలు, కాకినాడ జిల్లా తీర ప్రాంతాలపై పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. తన నియోజకవర్గమైన పిఠాపురం పరిస్థితిపై కూడా ఆరా తీశారు. ఉప్పాడ తీరంలో దెబ్బతిన్న రహదారి, కూలిపోయిన ఇళ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. "ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సహాయక చర్యలను మరింత పకడ్బందీగా చేపట్టాలి. తుపాను ప్రభావం తగ్గాక పంట నష్టం అంచనాలను అత్యంత పారదర్శకంగా నమోదు చేయాలి. చెరువుల గట్లు, వాగులు, వంకల్లో వరద ప్రవాహాన్ని నిరంతరం గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలి" అని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.

గంటకు 140 కి.మీ. వేగంతో గాలుల బీభత్సం

ఈ సమీక్ష సందర్భంగా, అధికారులు తుపాను పరిస్థితిని ఉప ముఖ్యమంత్రికి వివరించారు. యానాంకు దక్షిణంగా అర్ధరాత్రి 1:20 గంటలకు ప్రారంభమైన తీరం దాటే ప్రక్రియ ఉదయం వరకు కొనసాగిందని తెలిపారు. ఈ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయని, గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని కూడా తాకాయని పేర్కొన్నారు.

బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ గాలుల విధ్వంసం అధికంగా ఉందని అధికారులు నివేదించారు. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలు, విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయాయని వివరించారు. గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, పోలవరం ఏజెన్సీ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపారు. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 93 రహదారులు దెబ్బతినగా, 736 చెట్లు నేలకొరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.

గాలుల తీవ్రత తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో రోడ్లపై కూలిన చెట్లను తొలగించడం, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం వంటి పనులు తక్షణమే ప్రారంభించామని కలెక్టర్లు తెలిపారు. తీర ప్రాంత గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాల్లో సురక్షితంగా ఉన్నారని, జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ల ద్వారా సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఉప ముఖ్యమంత్రికి వివరించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Pawan KalyanCyclone ArnabAndhra PradeshRelief OperationsKonaseemaPithapuram

More Telugu News

కెప్టెన్ స్మిత్ మచ్చర్ తలపై బలమైన గాయం.. ఎన్ని కుట్లో..! ఫొటో పంచుకున్న ఏపీ బీజేపీ

28 Oct, 17:05

అర్నబ్ తుపానుతో ఇప్పటికే కుండపోత.. ఏపీకి మరో 7 రోజుల పాటు భారీ వర్ష సూచన

28 Oct, 17:04

వైసీపీ ఓటు బ్యాంక్ ఇంకా తగ్గాలి.. రాష్ట్రం బాగుపడాలంటే అదే మార్గం: సీఎం చంద్రబాబు

28 Oct, 16:39

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే!

28 Oct, 16:23

ఆటో షేర్ల జోరు.. అయినా నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్

28 Oct, 16:23

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది: కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు ధ్వజం

28 Oct, 16:21

ఏపీని వణికిస్తున్న అర్నబ్ తుపాను.. వేర్వేరు ఘటనల్లో 7 మంది మృతి

28 Oct, 15:59

అటక మీద దొరికిన పాత విత్తనాలు.. ఇటలీ రైతు దశ మార్చిన అద్భుత పంట!

28 Oct, 15:54

లాస్ ఏంజిల్స్‌లో 'రామాయణ' స్పెషల్ స్క్రీనింగ్.. సోషల్ మీడియాలో టాక్ ఇదే!

28 Oct, 15:53

'దహాన్' (ఆహా) మూవీ రివ్యూ!

28 Oct, 15:41

ఈ నెలాఖరున దాన కిశోర్ పదవీ విరమణ.. గవర్నర్ స్పెషల్ సీఎస్‌గా పునర్నియామకం

28 Oct, 15:37

టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు: మోదీ, అమిత్ షాలపై రాహుల్ గాంధీ ఫైర్

28 Oct, 15:24

రాడార్ టెక్నాలజీ, రైడ్ హైట్ ఫీచర్ తో 'ట్రయంఫ్' బైక్.. ఆగినప్పుడు ఎత్తు తగ్గే సీటు!

28 Oct, 15:20

టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. 6 కంపెనీల బోర్డుల నుంచి వైదొలగనున్న నోయెల్ టాటా

28 Oct, 15:19
..More Telugu News