అర్నాబ్ బీభత్సం.. ఉప్పాడ తీరంలో 30 ఇళ్లు నేలమట్టం.. కొట్టుకుపోయిన రోడ్డు

Andhra
Advertisement
  • అర్నబ్ తుపాన్ ధాటికి అతలాకుతలమైన ఉప్పాడ తీరం
  • సముద్రపు కోతకు కొట్టుకుపోయిన ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు
  • రాకాసి అలల ఉద్ధృతికి సుమారు 30 ఇళ్లు నేలమట్టం
  • తీర ప్రాంత గ్రామాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు
Advertisement
అర్నబ్ తుపాను సృష్టించిన బీభత్సంతో కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతం అతలాకుతలమైంది. ఈ తెల్లవారుజామున విరుచుకుపడిన రాకాసి అలల ధాటికి ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు కొట్టుకుపోగా, సుమారు 30 ఇళ్లు నేలమట్టమయ్యాయి. సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో తీరప్రాంత గ్రామాలు వణికిపోయాయి.

తుపాను ప్రభావంతో సుబ్బంపేట, ఉప్పాడ, సూరడపేట, జగ్గరాజుపేట, పల్లిపేట, రంగంపేట, మాయాపట్నం వంటి గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. అలల ఉద్ధృతికి దాదాపు 30 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. బలమైన గాలులకు మరికొన్ని ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. సుబ్బంపేట వద్ద తీరప్రాంతాన్ని కాపాడేందుకు నిర్మించిన రక్షణ గోడ సైతం పూర్తిగా ధ్వంసమైంది. రక్షణ కోసం ఏర్పాటు చేసిన భారీ బండరాళ్లు కూడా అలల తాకిడికి చెల్లాచెదురయ్యాయి.

ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు అనేక చోట్ల కోతకు గురైంది. ముఖ్యంగా సుబ్బంపేట వద్ద రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో అధికారులు బీచ్ రోడ్డుపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. దెబ్బతిన్న ఇళ్లు, రహదారులను పరిశీలిస్తున్నారు. సముద్రం ఇంకా అల్లకల్లోలంగా ఉన్నందున ప్రజలు తీరప్రాంతాలకు వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. నష్టాన్ని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే బీచ్ రోడ్డుపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.
Advertisement

సంబంధిత వార్తలు

Cyclone ArnabUppada Beach RoadKakinada DistrictAndhra Pradesh CycloneUppada Coastal DestructionSea Erosion Kakinada

More Telugu News

సెక్రటేరియట్‌కు సీఎం చంద్రబాబు.. తుపాను పరిస్థితిపై సమీక్ష

28 Oct, 13:43

అర్నబ్ తుపాను నష్టంపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. తక్షణ సాయం కోరుతూ విజ్ఞప్తి

28 Oct, 13:26

వెయ్యి కి.మీ. రేంజ్ మిస్సైళ్లు... శిక్షణ కోసం భారత్ వైపు జపాన్ చూపు

28 Oct, 13:06

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులపై కేంద్రం ఉక్కుపాదం?

28 Oct, 13:04

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖలకు కొత్త అధికారులు

28 Oct, 12:58

యవ్వనంగా కనిపించాలా?.. కొలాజెన్‌ను పెంచే ఈ 4 మార్గాలు మీకోసమే!

28 Oct, 12:40

క్రీడాలోకంలో విషాదం.. మూడుసార్లు పారా గేమ్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ బలవన్మరణం

28 Oct, 12:20

‘ఓం’లో నా ఆల్టర్ ఇగోను చూస్తున్నా: ఐపీఎస్ పాత్రపై సాయి పల్లవి

28 Oct, 12:18

అర్నాబ్ తుపాను బీభత్సం.. సహాయక చర్యలపై మంత్రులు నారాయణ, ఆనగాని టెలీకాన్ఫరెన్స్

28 Oct, 12:16

జైలు నుంచే జెడ్పీటీసీ ఎన్నికల బరిలో వైసీపీ నేత.. ప్రచారంలో భార్య!

28 Oct, 12:13

'రావణుడిని కాల్చరు.. కొలుస్తారు'.. గ్రేటర్ నోయిడాలోని ఈ గ్రామంలో దసరా ఎంతో ప్రత్యేకం!

28 Oct, 12:11

తిరుమల సమాచారం: 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు, సిఫార్సు లేఖల రద్దు

28 Oct, 12:07

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల జాబితాపై బండి సంజయ్ విమర్శలు

28 Oct, 11:35

కోహ్లీని దాటేసిన అభిషేక్.. బద్దలైన రికార్డులు.. మరో రికార్డుకు 40 పరుగుల దూరం

28 Oct, 11:29
..More Telugu News