'బ్రేకింగ్ బ్యాడ్' తర్వాత ఇప్పుడు 'ప్రిజన్ బ్రేక్': విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్ విమర్శలు
Advertisement
- తేని జైలు నుంచి 17 మంది విచారణ ఖైదీలు పరారీ కావడంతో దుమారం
- సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం చేతకానిదని స్టాలిన్ ఆరోపణ
- ఇది 1995 తర్వాత జరిగిన అతిపెద్ద జైలు ఘటన అని వ్యాఖ్య
Advertisement
తమిళనాడులోని తేని జిల్లాలో జరిగిన జైలు ఘటనపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, అధికార టీవీకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపిస్తూ, ప్రముఖ వెబ్ సిరీస్‌ల పేర్లతో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 'బ్రేకింగ్ బ్యాడ్' తర్వాత ఇప్పుడు 'ప్రిజన్ బ్రేక్' మొదలైందని ఆయన ఎద్దేవా చేశారు.
తేని జిల్లాలోని తెక్కంపట్టి సబ్ జైలు నుంచి నిన్న రాత్రి 17 మంది విచారణ ఖైదీలు పరారైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో స్పందించిన స్టాలిన్... సీఎం విజయ్ పరిపాలన వైఫల్యంపై విమర్శలు చేశారు. "బ్రేకింగ్ బ్యాడ్ తర్వాత ఇప్పుడు తమిళనాడులో ప్రిజన్ బ్రేక్ కూడా మొదలైంది. బెయిల్‌పై బయటకు వచ్చిన వారినే పర్యవేక్షించడం లేదనుకున్నా. కానీ ఈ చేతకాని ప్రభుత్వ హయాంలో జైళ్లలో ఉన్న ఖైదీలు కూడా సులభంగా తప్పించుకుంటున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు.
1995 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఖైదీలు తప్పించుకోవడం ఇదే మొదటిసారని స్టాలిన్ గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం ప్రజలను రక్షించలేదని, ప్రజలకు స్వీయరక్షణే శరణ్యమని ఆయన అన్నారు. ఇటీవల టీవీకే పార్టీ నేత ఒకరు నార్కోటిక్స్ కేసులో పట్టుబడినప్పుడు స్టాలిన్ ఆ పార్టీని 'బ్రేకింగ్ బ్యాడ్ పార్టీ' అని విమర్శించిన విషయం తెలిసిందే.
తేని జైలు ఘటనలో, ఓ ఖైదీకి మూర్ఛ వచ్చిందని నమ్మించిన ఖైదీలు, సెల్‌లోకి వచ్చిన గార్డులపై దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటన తర్వాత అప్రమత్తమైన పోలీసులు, పరారైన వారిని పట్టుకోవడానికి 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు నలుగురు ఖైదీలను తిరిగి అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులుగా తొమ్మిది మంది జైలు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి విజయ్ వద్దే హోం శాఖ ఉండటంతో, విపక్షాల విమర్శలకు ఆయన నేరుగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.