స్థానికాల్లోనూ అదే స్ఫూర్తి.. కూటమిని గెలిపించండి: ఎన్డీఏ నేతల విజ్ఞప్తి
Advertisement
- స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని ప్రజలను కోరిన చంద్రబాబు, పవన్
- టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిందని వెల్లడి
- సీట్లు దక్కని వారికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామంటూ పవన్ కల్యాణ్ హామీ
- కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నాయని నేతల వెల్లడి
- ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రం ముందుకు సాగుతోందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
Advertisement
రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సార్వత్రిక ఎన్నికల స్ఫూర్తిని ప్రదర్శించి, కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు మీడియా సమావేశం నిర్వహించి, స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడారు. గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకు ప్రజల సంపూర్ణ మద్దతు అవసరమని వారు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఐక్యంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొంత క్లిష్టంగా ఉంటుందని, అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సుదీర్ఘ అనుభవంతో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారని ప్రశంసించారు.
రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు సర్దుకుపోయాయని, క్షేత్రస్థాయిలోనూ కార్యకర్తలు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. సీట్లు దక్కని వారికి భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేసే బాధ్యతను కూటమి తీసుకుంటుందని పవన్ భరోసా ఇచ్చారు.
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో, పారిశ్రామికవేత్తల్లో ఉన్న నమ్మకం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని పవన్ అన్నారు. దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే రావడం చంద్రబాబు సమర్థ నాయకత్వానికి నిదర్శనమని కొనియాడారు. రాష్ట్రానికి రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.
'పల్లె పండుగ 1.0, 2.0', 'అడవితల్లి బాట' వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. జల్ జీవన్ మిషన్ కింద రూ.30 వేల కోట్లతో 3.20 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందించే బృహత్తర కార్యక్రమం చేపట్టామన్నారు. గత ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన ఉద్యోగులకు రూ.30 వేల కోట్ల బకాయిలు చెల్లించామని, గంజాయిపై ఉక్కుపాదం మోపామని స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలా అండగా నిలుస్తోందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో చూపిన ఆదరణనే స్థానిక ఎన్నికల్లోనూ చూపించి, కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.