పండగ పూట ర్యాలీ వద్దు.. రాహుల్‌కు ఢిల్లీ వ్యాపారుల వినతి.. రూ.10,000 కోట్ల నష్టం తప్పదని ఆవేదన!
Advertisement
- నవంబర్ 1న తలపెట్టిన ర్యాలీని వాయిదా వేయాలని రాహుల్‌ను కోరిన ఢిల్లీ వ్యాపారులు
- దీపావళి సీజన్‌లో వ్యాపారాలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆందోళన
- ర్యాలీ జరిగితే రూ.10,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని అంచనా
- సీఈసీకి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం చేపడుతోన్న ‘ఇండియా’ కూటమి
- వ్యాపారుల విజ్ఞప్తిని పరిశీలిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే హామీ
Advertisement
దేశ రాజధాని ఢిల్లీలో పండగ వాతావరణం నెలకొన్న వేళ, రాజకీయ వేడి రాజుకుంది. నవంబర్ 1న రామ్‌లీలా మైదానంలో ‘ఇండియా’ కూటమి తలపెట్టిన భారీ ర్యాలీని వాయిదా వేయాలని ఢిల్లీకి చెందిన వ్యాపారులు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మరోసారి విజ్ఞప్తి చేశారు. దీపావళి పండుగకు కొన్ని రోజుల ముందు ఈ ర్యాలీ నిర్వహించడం వల్ల తమ వ్యాపారాలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, సుమారు రూ.10,000 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ప్రతినిధులు ఈ మేరకు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. ఈ ర్యాలీకి దాదాపు 10 లక్షల మంది ప్రజలు, 15,000 నుంచి 20,000 బస్సులు వచ్చే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.
దీనివల్ల మధ్య ఢిల్లీలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోతుందని, పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడం, రోడ్లు మూసివేయడం, మెట్రో స్టేషన్లను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. రామ్‌లీలా మైదానానికి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న చాందినీ చౌక్, సదర్ బజార్, చావ్డీ బజార్, కశ్మీరీ గేట్ వంటి ప్రధాన హోల్‌సేల్ మార్కెట్లపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వారు పేర్కొన్నారు.
సీటీఐ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ మాట్లాడుతూ.. ధనత్రయోదశి (నవంబర్ 6), దీపావళి (నవంబర్ 8)కి వారం ముందు నుంచే పండుగ కొనుగోళ్లు ఊపందుకుంటాయని తెలిపారు. ఇటీవలే జరిగిన కొన్ని నిరసనల కారణంగా ఇప్పటికే వ్యాపార వర్గాలు రూ.3,000 కోట్ల నష్టాన్ని చవిచూశాయని, ఇప్పుడు ఈ ర్యాలీ కూడా జరిగితే నష్టం రూ.10,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని నవంబర్ 10 తర్వాత నిర్వహించాలని వారు కోరారు.
వ్యాపారుల అభ్యర్థనపై రాహుల్ గాంధీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ప్రభుత్వమే మెట్రోను నిలిపివేసి, రోడ్లను మూసివేస్తోందని ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధాని మోదీ తొలగిస్తే, 30 సెకన్లలో నిరసనలు ఆగిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు, మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ వ్యాపారుల విజ్ఞప్తిని పరిశీలిస్తామని సూచనప్రాయంగా తెలిపారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు, ఎలక్టోరల్ రోల్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు వ్యతిరేకంగా ఈ ర్యాలీని ‘ఇండియా’ కూటమి ప్లాన్ చేసింది. దీంతో పండుగ సీజన్‌లో వ్యాపారుల ప్రయోజనాలు, రాజకీయ పార్టీల నిరసన హక్కు మధ్య నెలకొన్న ఈ ప్రతిష్ఠంభనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.