గ్రావిటీతో నీళ్లిస్తే రాజీనామా చేస్తా: ప్రభుత్వానికి హరీశ్‌రావు సవాల్
Advertisement
- తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీతో నీళ్లు తెస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్
- ప్రస్తుత కరవు కాంగ్రెస్ తెచ్చిన కరవు అని విమర్శ
- తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు డీపీఆర్‌ను బహిర్గతం చేయాలని డిమాండ్
Advertisement
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం సాధ్యమని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ నిరూపించలేకపోతే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తారా? అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. గ్రావిటీతో నీళ్లు వస్తాయని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో నెలకొన్న కరవుకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని హరీశ్ ఆరోపించారు. "ఇది కాలం తెచ్చిన కరవు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరవు" అని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరిలో నీరు అందుబాటులో ఉన్నా ఎత్తిపోతలు చేపట్టకుండా ప్రభుత్వం రైతులను నష్టపరుస్తోందని విమర్శించారు. 33 శాతం వర్షపాతం లోటు ఉన్న ఏపీలో లేని క్రాప్ హాలిడే, కేవలం 17 శాతం లోటు ఉన్న తెలంగాణలో ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు.
ప్రభుత్వం తక్షణమే మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టి, కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని, అసలు ఆ ప్రతిపాదనకు సంబంధించిన డీపీఆర్‌ను ఎందుకు బహిర్గతం చేయడం లేదని నిలదీశారు. తుమ్మిడిహెట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం స్పష్టం చేసిన తర్వాతే, తమ ప్రభుత్వం మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని ఆయన గుర్తుచేశారు.