మహేశ్ సినిమాపై రాజమౌళి కీలక వ్యాఖ్యలు.. అది టైమ్ ట్రావెల్ కాదు, అంతకుమించి!

Entertainment
Advertisement
  • మహేశ్ బాబు సినిమా కేవలం టైమ్ ట్రావెల్ కథ కాదన్న జ‌క్క‌న్న‌
  • వేర్వేరు ప్రపంచాలు, కాలాల మధ్య సాగే సాహస యాత్రగా వర్ణన
  • అంటార్కిటికా, ఆఫ్రికా, వారణాసి, పురాణ యుగం వరకు కథ ప్రయాణిస్తుందని వెల్లడి
  • తండ్రీకొడుకుల మధ్య ఉండే భావోద్వేగమే ఈ కథకు ప్రధాన బ‌లం అని వివరణ
Advertisement
'ఆర్ఆర్ఆర్‌' వంటి ప్రపంచస్థాయి విజయం తర్వాత ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న 'వార‌ణాసి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ రాజమౌళి స్వయంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ చిత్రం కేవలం టైమ్ ట్రావెల్ కథ కాదని, అంతకుమించిన ఒక గొప్ప సాహస యాత్ర అని జ‌క్క‌న్న‌ స్పష్టం చేశారు.

ఇటీవల ఓ బ్రెజిలియన్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. "మా సినిమా స్కేల్‌ను కేవలం మాటల్లో వర్ణించడం కష్టం. అందుకే గతేడాది ఒక గ్లింప్స్ విడుదల చేశాం. కథను చెప్పకుండా, ప్రేక్షకులు ఎలాంటి ప్రపంచాలను, అనుభూతులను చూడబోతున్నారో తెలియజేయడమే ఆ వీడియో ఉద్దేశం" అని తెలిపారు.

సినిమా కథా నేపథ్యం గురించి ఆయన మరింత లోతుగా వివరించారు. "దీనిని కేవలం టైమ్ ట్రావెల్ కథగా చూడవద్దు. ఈ సినిమా వేర్వేరు ప్రపంచాల మీదుగా ముందుకు సాగే ఒక అడ్వెంచర్. అంటార్కిటికా నుంచి ఆఫ్రికాకు, అక్కడి నుంచి వారణాసి నగరానికి ప్రయాణిస్తుంది. అంతేకాదు, ఇది వేర్వేరు యుగాల్లోకి కూడా ప్రయాణిస్తుంది. పురాణ యుగంలోకి కూడా వెళ్తాం. అక్కడ మీరు భారీ రూపంలో ఉండే జీవులను, దేవుళ్లను, అలాంటి ఎన్నో అంశాలను చూస్తారు" అని రాజమౌళి వివరించారు.

అయితే ఇంతటి భారీ హంగుల వెనుక ఉన్న అసలు కథ తండ్రీకొడుకుల మధ్య ఉండే భావోద్వేగమేనని ఆయన నొక్కి చెప్పారు. "ఈ మొత్తం సాహస యాత్రకు తండ్రీకొడుకుల మధ్య ఉండే బలమైన ప్రేమ, వారి మధ్య ఉన్న బంధమే చోదక శక్తి. ఆ భావోద్వేగాలే ఈ మొత్తం కథను ముందుకు నడిపిస్తాయి" అని జక్కన్న స్పష్టం చేశారు.

ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో మహేశ్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించనుండగా, నాయిక ‘మందాకిని’ పాత్రలో ప్రియాంక చోప్రా జోనాస్, ప్రతినాయకుడు ‘కుంభ’గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. తాజాగా రాజమౌళి వ్యాఖ్యలతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.

Advertisement

సంబంధిత వార్తలు

SS RajamouliMahesh BabuSSMB29Priyanka Chopra JonasPrithviraj SukumaranAdventure Action Movie

More Telugu News

మాది అభివృద్ధి, వారిది విధ్వంసం.. గొడ్డలి పార్టీ హింసను వీడి జనస్రవంతిలో కలవాలి: సీఎం చంద్రబాబు

27 Oct, 13:03

సీఎం చంద్రబాబు కృషి వల్లే సమన్వయం: మాధవ్ ప్రశంస

27 Oct, 12:58

గేమింగ్‌లో మొదలై ప్రపంచమంతా పాకిన పదం.. 2026 ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ ఇదే..!

27 Oct, 12:57

కొత్త పెళ్లికూతురిగా విధులకు లోకో పైలట్.. వీడియో వైరల్!

27 Oct, 12:53

'బ్రేకింగ్ బ్యాడ్' తర్వాత ఇప్పుడు 'ప్రిజన్ బ్రేక్': విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్ విమర్శలు

27 Oct, 12:48

భారత్‌ నుంచి రూ.5,876 కోట్ల వస్తువులు.. నిషేధం ఉన్నా పాకిస్థాన్‌కు ఎలా చేరాయి?

27 Oct, 12:46

స్థానిక ఎన్నికలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. రెబల్స్‌కు స్పష్టమైన హెచ్చరిక జారీ

27 Oct, 12:33

స్థానికాల్లోనూ అదే స్ఫూర్తి.. కూటమిని గెలిపించండి: ఎన్డీఏ నేతల విజ్ఞప్తి

27 Oct, 12:25

చెంబరంబాక్కం రిజర్వాయర్‌కు సీఎం విజయ్.. 2015 పునరావృతం కాకూడదని హెచ్చరిక!

27 Oct, 12:23

సిరీస్‌పై కన్నేసిన భారత్‌.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న అయ్యర్‌!

27 Oct, 12:19

పండగ పూట ర్యాలీ వద్దు.. రాహుల్‌కు ఢిల్లీ వ్యాపారుల వినతి.. రూ.10,000 కోట్ల నష్టం తప్పదని ఆవేద‌న‌!

27 Oct, 12:17

అనిరుధ్‌-కావ్య రిసెప్షన్‌ కార్డు చూశారా? రాజసం ఉట్టిపడే డిజైన్‌ వైరల్‌!

27 Oct, 12:15

హౌతీలతో కాల్పుల విరమణ ఒప్పందం.. సౌదీ అరేబియా రూ.9,500 కోట్ల‌ ఆఫర్?

27 Oct, 11:51

ఆర్నబ్ తుపాను: ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం.. రోడ్డుపైకి బండరాళ్లు

27 Oct, 11:48

సోషల్‌ మీడియాలో 21 లక్షల మంది ఫాలోవర్లు.. ఎన్నికల్లో వచ్చింది 33 ఓట్లే!

27 Oct, 11:47
..More Telugu News