ఆర్నబ్ తుపాన్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. హోంమంత్రి అనిత కీలక సూచనలు
Advertisement
- తీరం వైపు దూసుకొస్తున్న ఆర్నబ్ తీవ్ర తుపాన్
- రేపు ఉదయం బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం
- తీర జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
Advertisement
బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఆర్నబ్' తుపాను అతి తీవ్ర తుపాన్‌గా మారింది. ఇది రేపు ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు భారీ స్థాయిలో సహాయక చర్యలను ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి, జీరో క్యాజువాలిటీ లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు.
తీర ప్రాంత జిల్లాల్లో 15 ఎన్డీఆర్ఎఫ్ (NDRF), 8 ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలను మోహరించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 89,000 మందిని గుర్తించి, 101 పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా కాకినాడ తీరంలోని హోప్ ఐలాండ్‌ను పూర్తిగా ఖాళీ చేయించారు.
ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ ప్రధమ ప్రాధాన్యత అని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దని, సముద్ర తీరాలకు దూరంగా ఉండాలని సూచించారు.