ప్రధానిపై ఖర్గే వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన రాంచందర్ రావు
Advertisement
- ప్రధాని తండ్రిని ఉద్దేశించి ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు
- తీవ్రంగా ఖండించిన తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
- అధికారానికి దూరమవడంతో కాంగ్రెస్‌లో అసహనం అని వ్యాఖ్య
Advertisement
ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత ఇంత దిగజారుడు భాష మాట్లాడటం అత్యంత విచారకరమని అన్నారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన రాంచందర్ రావు... గత పన్నెండున్నర ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉండటంతో కాంగ్రెస్ నేతల్లో తీవ్రమైన అసహనం కనిపిస్తోందని విమర్శించారు. ఆ నిరాశా నిస్పృహల నుంచే మోదీ తండ్రిని కూడా నిందిస్తూ ఖర్గే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఖర్గే మాట్లాడిన సభలో వేదికపై ఉన్న నేతల కంటే కింద ఉన్న ప్రేక్షకులు చాలా తక్కువగా ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
బీహార్‌లోని పాట్నాలో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా... ఓ వ్యక్తి మోదీ ఓడిపోరంటూ నినాదాలు చేశారు. దీనికి స్పందించిన ఖర్గే.. 'మోదీ కా బాప్ భీ జాయేగా' (మోదీ అబ్బ కూడా దిగిపోవాల్సిందే) అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ నేతలు ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై పాట్నాలోని పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.