గాయంతో ఇషాన్ కిషన్ ఔట్.. మూడో టీ20లో టీమిండియా కాంబినేషన్ ఏంటి?

Sports
Advertisement
  • న్యూజిలాండ్‌తో మూడో టీ20కి గాయం కారణంగా దూరమైన కిషన్
  • కిషన్ ఇంకా పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదని స్పష్టం చేసిన బీసీసీఐ
  • గత మ్యాచ్‌లో కిషన్ స్థానంలో నంబర్ 3లో ఆడి విఫలమైన వైభవ్
  • అత‌నితో ఓపెనింగ్ చేయించి, సంజూను మూడో స్థానంలో ఆడించాలని మాజీల‌ సూచన
Advertisement
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయం కారణంగా మూడో టీ20కి కూడా దూరమయ్యాడు. మొదటి టీ20లో కుడి కాలి కండరాల నొప్పితో బాధపడిన అతను, ఇంకా పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 27న వెల్లింగ్టన్‌లో జరిగే చివరి టీ20కి అతను అందుబాటులో ఉండడని స్పష్టం చేసింది.

"ఇషాన్ కిషన్ గాయం నుంచి బాగానే కోలుకుంటున్నాడు. అయితే, పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి ఇంకాస్త సమయం పడుతుంది. అందుకే మూడో టీ20 నుంచి అతడిని తప్పించాం. బీసీసీఐ వైద్య బృందం అతని పురోగతిని పర్యవేక్షిస్తోంది. కిషన్ స్థానంలో జట్టులోకి వచ్చిన కుమార్ కుశాగ్ర మూడో టీ20కి కూడా జట్టుతోనే కొనసాగుతాడు" అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

జట్టు కూర్పుపై తీవ్ర చర్చ 
ఇషాన్ కిషన్ గైర్హాజరీతో భారత జట్టు కూర్పుపై తీవ్ర చర్చ మొదలైంది. రెండో టీ20లో కిషన్ స్థానంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని నంబర్ 3లో ఆడించగా, అతను 8 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, మురళీ కార్తీక్ జట్టు కూర్పుపై కీలక సూచనలు చేశారు.

"వైభవ్ సూర్యవంశీ నంబర్ 3లో బ్యాటింగ్‌కు వచ్చి చాలా ఇబ్బంది పడ్డాడు. అతని ఆట చూస్తే 'నీటిలోంచి బయటపడ్డ చేప'లా అనిపించింది. తన కెరీర్‌లో ఎప్పుడూ ఓపెనర్‌గానే ఆడిన అతడికి ఆ స్థానం కొత్త. ఇలాంటి సమయంలో సీనియర్ ఆటగాళ్లు అతడికి అండగా నిలవాలి" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో విశ్లేషించాడు.

ఇదే అభిప్రాయాన్ని మురళీ కార్తీక్ కూడా వ్యక్తం చేశాడు. "వైభవ్ సూర్యవంశీని జట్టులో ఆడిస్తే, అతడిని ఓపెనర్‌గానే పంపాలి. మధ్యల ఆడించడం సరైన పద్ధతి కాదు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లను అవసరమైన స్థానాల్లో ఆడించవచ్చు. నా అభిప్రాయం ప్రకారం, సూర్యవంశీతో ఓపెనింగ్ చేయించి, ఇషాన్ కిషన్ స్థానంలో సంజూ శాంసన్‌ను నంబర్ 3లో ఆడిస్తే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది" అని కార్తీక్ సూచించాడు. ఈ సూచనల నేపథ్యంలో చివరి టీ20లో టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Advertisement

సంబంధిత వార్తలు

Ishan KishanIndia vs New ZealandTeam IndiaVaibhav SuryavanshiSanju SamsonBCCI

More Telugu News

10,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50MP కెమెరాతో వివో కొత్త ఫోన్‌

26 Oct, 12:57

290 కోట్లు దాటిన మహిళల ఉచిత బస్సు ప్రయాణాలు.. రేవంత్ రెడ్డి స్పందన

26 Oct, 12:55

ఢిల్లీలో కీలక ప్రభుత్వ భవనంలో మంటలు.. నార్త్‌ బ్లాక్‌కు ఫైర్‌ ఇంజిన్లు

26 Oct, 12:50

మహిళా అభిమానులకు ధనుశ్‌ గిఫ్ట్.. వెండి దీపంపై కమలం గుర్తుతో రాజకీయ దుమారం

26 Oct, 12:39

అమ్మ చేతి వంట కోసం.. టూర్ నుంచి రాకముందే సచిన్ ఏం చేసేవారో తెలుసా?

26 Oct, 12:22

అభిమానులకు సారీ చెప్పిన హీరో విష్వక్ సేన్

26 Oct, 12:20

నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. తడబడుతున్న భువీకి బౌలింగ్‌ కోచ్‌ మోర్కెల్‌ విలువైన సూచనలు!

26 Oct, 12:18

అర్నాబ్ ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్

26 Oct, 12:16

రాహుల్‌ గాంధీకి కోర్టులో భారీ ఊరట.. అమిత్‌ షా కేసులో కీలక తీర్పు!

26 Oct, 12:12

విజయవాడకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్.. ఘన స్వాగతం పలికిన గవర్నర్, మంత్రి లోకేశ్‌

26 Oct, 12:01

బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన రజనీ.. తమిళ సినీ చరిత్రలో నెం.1 చిత్రంగా 'జైలర్ 2'!

26 Oct, 11:59

సీతగా నటించేటప్పుడు బుర్రకు పని చెప్పలేదు.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు!

26 Oct, 11:58

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేరిట నకిలీ ఖాతాలు.. రంగంలోకి పోలీసులు

26 Oct, 11:56

రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు!

26 Oct, 11:54

సిద్దరామయ్య స్టింగ్ ఆపరేషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. పోలీసుల ముందు మహిళ వాంగ్మూలం

26 Oct, 11:46
..More Telugu News