మిథున్ రెడ్డిపై దాడి హేయం: బుట్టా రేణుక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మిథున్ రెడ్డిపై దాడి హేయం: బుట్టా రేణుక

Attack on Midhun Reddy is Heinous says Butta Renuka
  • పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి
  • ఇది ప్రభుత్వ కుట్ర రాజకీయమేనన్న రేణుక
  • ప్రతిపక్ష నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపణ
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై పుంగనూరులో జరిగిన దాడిని వైసీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక తీవ్రంగా ఖండించారు. ఆయనపై జరిగిన దాడి హేయమైన చర్య అని ఆమె అభివర్ణించారు. ప్రస్తుత అధికార కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు బనాయిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఏకగ్రీవాల కోసం పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై అక్రమంగా కేసు నమోదు చేశారని తెలిపారు.

ఎన్నికల్లో ప్రజా మద్దతు కోల్పోతామన్న భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని బుట్టా రేణుక విమర్శించారు. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం, వారిని భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని అన్నారు. మిథున్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. 
Advertisement
Midhun Reddy
Butta Renuka
Punganur Attack
YSRCP
Chandrababu Naidu
Andhra Pradesh Politics

More Telugu News