బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
- ఛాతీ ఇన్ఫెక్షన్తో ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చేరిక
- ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నవైద్యులు
- ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స
- గతంలోనూ పలుమార్లు ఆసుపత్రిలో చేరిన అద్వానీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేత, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనను శుక్రవారం రాత్రి ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు శనివారం వెల్లడించాయి.
98 ఏళ్ల అద్వానీని శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకువచ్చారు. పల్మనరీ విభాగానికి చెందిన వైద్యుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోంది. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవలి కాలంలో అద్వానీ ఆసుపత్రిలో చేరడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది మే నెలలో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన ఇదే ఆసుపత్రిలో కొన్ని రోజులు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. అంతకుముందు, 2024 డిసెంబర్లో కూడా ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్చి చికిత్స అందించారు.
భారత రాజకీయాల్లో అత్యంత ప్రముఖ నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో 2002 నుంచి 2004 వరకు ఉప ప్రధానిగా పనిచేశారు. ఆయన దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2024లో కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న'తో సత్కరించింది.