పులివెందులలో నామినేషన్ వేసిన వైఎస్ ప్రమీల
- పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ పదవికి వైఎస్ ప్రమీల నామినేషన్
- వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ సీఎం జగన్ చిన్నమ్మ
- టీడీపీ కూటమి తరఫున తుగుట్ల గీతా కుమారి పోటీ
పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ నిన్న ఉత్సాహంగా ప్రారంభమైంది. మున్సిపల్ చైర్పర్సన్ పదవికి వైసీపీ అభ్యర్థిగా వైఎస్ ప్రమీల తన నామినేషన్ దాఖలు చేశారు. ఈమె వైసీపీ అధినేత జగన్ కు చిన్నమ్మ, మాజీ మున్సిపల్ వైస్-చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డికి భార్య.
పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఆమె తన పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఆమెతో పాటు తొలిరోజు వివిధ వార్డులకు పలువురు వైసీపీ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు.
వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈసారి చైర్పర్సన్ పదవిని మహిళా (జనరల్) కేటగిరీకి రిజర్వ్ చేశారు. ప్రమీల గతంలో కూడా పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేశారు. ఆమెపై టీడీపీ కూటమి అభ్యర్థిగా తుగుట్ల గీతా కుమారి పోటీ చేస్తున్నారు.
నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతించారు. దీంతో కార్యాలయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడిన వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సందడి వాతావరణం కనిపించింది.