హైదరాబాద్ డబుల్ డెక్కర్ బస్సులకు బ్రేక్.. పర్యాటకులకు తప్పని తిప్పలు
- భాగ్యనగరంలో నిలిచిపోయిన డబుల్ డెక్కర్ బస్సు సర్వీసులు
- నెల రోజులుగా షెడ్డుకే పరిమితం
- నిర్వహణ బాధ్యతలు తీసుకుని విఫలమైన పర్యాటక శాఖ
- పండుగ సెలవుల్లో ఇబ్బందులు పడుతున్న నగర సందర్శకులు
- హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ప్రయాణానికి ప్రత్యామ్నాయం కరవు
హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డబుల్ డెక్కర్ బస్సులు నెల రోజులుగా రోడ్డెక్కడం లేదు. పండుగ సెలవుల నేపథ్యంలో నగరాన్ని చూసేందుకు వస్తున్న పర్యాటకులకు ఇది తీవ్ర నిరాశ కలిగిస్తోంది. హెచ్ఎండీఏ నుంచి నిర్వహణ బాధ్యతలను పర్యాటక శాఖ స్వీకరించినప్పటికీ, వాటిని నడపడంలో విఫలమైంది. దీంతో అత్యంత వైభవంగా ప్రారంభమైన ఈ బస్సు సర్వీసులు ప్రస్తుతం షెడ్డుకే పరిమితమయ్యాయి.
గతంలో హెచ్ఎండీఏ సుమారు రూ.13 కోట్ల వ్యయంతో ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేసింది. ఒక్కో బస్సులో 65 మంది ప్రయాణించే వీలుంది. ట్యాంక్బండ్, అసెంబ్లీ, చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్ వంటి ప్రధాన పర్యాటక మార్గాల్లో వీటిని ఉచితంగా నడిపారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో విజయవంతంగా నడిచిన ఈ బస్సుల నిర్వహణ బాధ్యతలను ఇటీవల పర్యాటక శాఖకు అప్పగించారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా గత నెల 27 నుంచే ఈ బస్సులను తిరిగి ప్రారంభిస్తామని పర్యాటక శాఖ అధికారులు ప్రకటించారు. బస్సులకు కొత్త రంగులు వేసి, హైదరాబాద్ అందాలను ప్రతిబింబించే స్టిక్కర్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కానీ, చెప్పిన తేదీ దాటి నెల రోజులు గడుస్తున్నా ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. ప్రస్తుతం ఈ బస్సులన్నీ సంజీవయ్య పార్కులోని ప్రత్యేక షెడ్లో నిలిపి ఉంచారు.
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు నగరానికి వస్తున్నారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో తిరిగేందుకు ఇతర వాహనాలకు అనుమతి లేకపోవడంతో డబుల్ డెక్కర్ బస్సులే ప్రధాన ఆధారం. అవి అందుబాటులో లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడం వల్ల వారిపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఓ కుటుంబం సచివాలయం నుంచి సంజీవయ్య పార్కుకు వెళ్లాలంటే రూ.400 నుంచి రూ.600 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని సందర్శకులు వాపోతున్నారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా ఈ బస్సు సర్వీసులను పునఃప్రారంభించాలని నగరవాసులు, పర్యాటకులు కోరుతున్నారు.