మేధ, జై జాస్తి జంటగా మైత్రీ మూవీ మేకర్స్ కొత్త చిత్రం
- హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తున్న నటుడు శ్రీకాంత్ కుమార్తె మేధ మేకా
- జై జాస్తి హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో కొత్త చిత్రం
- పృథ్వీ వనం దర్శకత్వంలో తెరకెక్కనున్న అందమైన ప్రేమకథ
- త్వరలో టైటిల్ వెల్లడించనున్నట్టు ప్రకటించిన చిత్రబృందం
టాలీవుడ్‌లో సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమార్తె మేధ మేకా హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. జై జాస్తి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి 'మైత్రీ ఇన్ లవ్' అనే వర్కింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. "వారితో మొదలై, మీ హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే ప్రేమకథ ఇది" అనే వ్యాఖ్యతో ఈ పోస్టర్‌ను పంచుకుంది. ఇది ఒక అందమైన ప్రేమకథగా రూపుదిద్దుకోనుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తుండగా, మహేశ్ బాబు. పి క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ కొత్త సినిమా టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. కాగా, నేటి ముహూర్తం ఈవెంట్ కు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నటుడు శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు. దర్శకురాలు నందినిరెడ్డి ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టారు.