సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే స్థానిక ఎన్నికలు: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్
Add ap7am to your home Screen

సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే స్థానిక ఎన్నికలు: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్

Anil Chandra Punetha says AP local body elections after Supreme Court verdict
  • జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్
  • స్థానిక ఎన్నికలకు అధికారం యంత్రాంగం సిద్ధంగా ఉందని వెల్లడి
  • బ్యాలెట్ పేపర్ల విధానంలోనే పోలింగ్ నిర్వహిస్తామని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గత రెండు నెలలుగా ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నామని, అధికారులు అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నారని వివరించారు.

ఈ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల విధానంలోనే నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 2026 ఫిబ్రవరి 5వ తేదీ నాటి ఫొటో ఓటర్ల జాబితాను ఈ ఎన్నికలకు ప్రామాణికంగా తీసుకోనున్నట్లు వెల్లడించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అవసరమైన ప్రింటింగ్ ప్రెస్‌ను కూడా త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
Advertisement
Anil Chandra Punetha
Andhra Pradesh Local Body Elections
AP SEC
Supreme Court Verdict
Ballot Paper Voting
Voter List 2026

More Telugu News