అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు.. చివరి నిమిషంలో కీలక నిర్ణయం!

Telangana
Advertisement
  • తొలుత అక్టోబర్‌ 4న పర్యటనకు ఖరారైన షెడ్యూల్‌
  • మెదక్‌, కరీంనగర్‌లో పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
  • షెడ్యూల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
  • నిరాశలో బీజేపీ శ్రేణులు
  • పర్యటనకు కారణాలు వెల్లడించని పార్టీ
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దయింది. ఒక రోజు పర్యటన నిమిత్తం రేపు ఆయన రాష్ట్రానికి రావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. దానికి గల కారణాలేంటో అధికారికంగా వెల్లడికాలేదు.

షెడ్యూల్‌ ప్రకారం అమిత్‌ షా నేటి రాత్రి 9 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, లోక్‌భవన్‌లో బస చేయాల్సి ఉంది. ఆదివారం ఉదయం మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారని.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని షెడ్యూల్ లో పేర్కొన్నారు.

హోంమంత్రి పర్యటన కోసం మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే పర్యటన రద్దుకు గల కారణం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఢిల్లీలో అత్యవసర పరిణామాలు లేదా ఇతర అనివార్య కారణాల వల్లే పర్యటన రద్దయి ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పర్యటన రద్దుతో బీజేపీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది. అమిత్‌ షా తెలంగాణకు ఎప్పుడు వస్తారనే విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Advertisement

సంబంధిత వార్తలు

Amit ShahTelangana Tour CanceledBJP TelanganaMedak Karimnagar VisitHome MinisterTelangana News

More Telugu News

వెల్లింగ్టన్‌లో పంత్ సెంచరీకి గవాస్కర్ స్టాండింగ్ ఒవేషన్.. ఇదిగో వీడియో!

22 Nov, 12:36

వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి

22 Nov, 12:25

కడప జిల్లాలో జనసేన కార్యకర్త మృతితో ఉద్రిక్తత.. 'పవన్ గారూ చూడండి' అంటూ బూటుతో కొట్టుకున్న నేత!

22 Nov, 12:17

గుజరాత్‌ ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మంది దుర్మరణం.. ఆర్మీ కుటుంబాల్లో విషాదం

22 Nov, 12:03

హైదరాబాద్‌లో ఏఎస్‌బీఎల్ 'లెగసీ' సరికొత్త రికార్డు.. తొలిరోజే రూ. 800 కోట్ల విక్రయాలు

22 Nov, 11:52

ఏపీలో మూడు కొత్త రైల్వే లైన్లు.. శ్రీశైలం, ఏజెన్సీ ప్రాంతాలకు రైలు మార్గం!

22 Nov, 11:45

వెల్లింగ్టన్ టెస్టులో పట్టు బిగించిన భారత్.. ఓటమి నుంచి గట్టెక్కేందుకు కివీస్ పోరాటం

22 Nov, 11:33

రేకుల గదికి నెల అద్దె రూ.2.12 లక్షలు.. ఎందుకింత?

22 Nov, 11:25

ఫిట్‌నెస్ మోజులో యువత.. సంతాన సామర్థ్యంపై స్టెరాయిడ్ల దెబ్బ!

22 Nov, 11:17

టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఫీట్‌.. తొలి జట్టుగా భారత్ ఘనత

22 Nov, 10:44

ఐఫోన్ డిజైన్‌తో లావా కొత్త ఫోన్.. ధర రూ.10,999 మాత్రమే

22 Nov, 10:26

సియాటిల్ ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా.. విమానం ఎక్కేముందు ప్రయాణికులను ఈడ్చుకెళ్లిన ఐసీఈ ఏజెంట్లు.. అస‌లేం జ‌రిగిందంటే!

22 Nov, 10:11

23 రోజులు.. 52 లక్షల పెళ్లిళ్లు.. ఊపందుకోనున్న ఆర్థిక వ్యవస్థ

22 Nov, 10:07

శాండ్‌పేపర్ వివాదం.. క్రోనే మ్యాచ్ ఫిక్సింగ్ కంటే పెద్ద స్కాండల్: బాయ్‌కాట్ సంచలన వ్యాఖ్యలు

22 Nov, 09:56

టెన్త్ సర్టిఫికెట్లలో మార్పులు కావాలా?.. ఇక మీసేవలోనే దరఖాస్తు!

22 Nov, 09:45
..More Telugu News