ప్రేమానంద్ శిష్యుడి మృతి కేసులో వీడని మిస్టరీ.. ప్రైవేట్ పార్ట్‌పై గాయం, గదిలో గ్రైండర్!
- ప్రేమానంద్ మహారాజ్ శిష్యుడి అనుమానాస్పద మృతి
- ఆశ్రమంలో నాలుగో అంతస్తు నుంచి దూకిన ఘటన
- గదిలో రక్తపు మరకలతో లభించిన టైల్ గ్రైండర్
- మర్మాంగంపై తీవ్ర గాయం వల్లే మరణమని పోస్ట్‌మార్టంలో నిర్ధారణ
- కుటుంబ సభ్యులు, సాధువుల నుంచి సీబీఐ విచారణకు డిమాండ్
ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ శిష్యుడు అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. ఆశ్రమంలోని నాలుగో అంతస్తు నుంచి దూకి మరణించిన ఈ ఘటనలో... గదిలో రక్తపు మరకలతో కూడిన గ్రైండర్ లభించడం, మృతుడి ప్రైవేట్ పార్ట్‌పై తీవ్రమైన గాయం ఉండటం కేసును సంక్లిష్టంగా మార్చింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన దీపక్ లోధి (25) రెండేళ్ల క్రితం ప్రేమానంద్ మహారాజ్ వద్ద దీక్ష స్వీకరించి, రసిక్ దులారి శరణ్‌గా పేరు మార్చుకున్నాడు. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో గురు కృపాకుంజ్ ఆశ్రమం పైనుంచి దూకేశాడు. తీవ్ర గాయాలపాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా... రసిక్ ఉదయం 10.25 గంటలకు రక్తపు మరకల దుస్తులతో గది నుంచి బయటకు వచ్చినట్లు ఉంది. ఆ తర్వాత నాలుగో అంతస్తు టెర్రస్‌పైకి వెళ్లి 10.36 గంటలకు కిందకు దూకాడు. పోలీసులు అతడి గదిని తనిఖీ చేయగా, రక్తంతో తడిసిన టైల్ కటింగ్ గ్రైండర్ లభించింది.
పోస్ట్‌మార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రైవేట్ పార్ట్‌పై తీవ్రమైన కట్ గాయం కారణంగా అధిక రక్తస్రావం జరిగిందని, అదే మరణానికి ప్రధాన కారణమని తేలింది. పైనుంచి పడటంతో తగిలిన గాయాలు అదనమని నివేదిక పేర్కొంది. పోలీసులు కేసును ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నప్పటికీ, అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. అతని మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని మృతుడి కుటుంబ సభ్యులతో పాటు స్థానిక సాధువులు డిమాండ్ చేస్తున్నారు.