ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్.. 372 కుటుంబాలకు నెరవేరిన సొంతింటి కల

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్.. 372 కుటుంబాలకు నెరవేరిన సొంతింటి కల

Nara Lokesh keeps promise as 372 families receive house site pattas
  • 'మన ఇల్లు-మన లోకేశ్' కార్యక్రమంలో 372 మందికి పట్టాల పంపిణీ
  • కుంచనపల్లిలో లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన మంత్రి నారా లోకేశ్
  • నియోజకవర్గంలో 80 శాతం పట్టాల సమస్య పరిష్కారమైందన్న మంత్రి
  • రెండు విడతల్లో రూ.2 వేల కోట్ల విలువైన భూములకు శాశ్వత హక్కులు
  • ఎన్నికల హామీ మేరకు దీర్ఘకాలిక సమస్యకు లోకేశ్ పరిష్కారం
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నారు. 'మన ఇల్లు-మన లోకేశ్' కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో 372 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రభుత్వ భూముల్లో చాలాకాలంగా నివసిస్తున్న పేదలకు శాశ్వత హక్కు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో దాదాపు 80 శాతం పట్టాల సమస్యను ఇప్పటికే పరిష్కరించామని తెలిపారు. మిగిలిన కేంద్ర ప్రభుత్వ భూముల సమస్యల పరిష్కారం కోసం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం పేదల దశాబ్దాల కలను నెరవేరుస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు రెండు విడతలుగా పట్టాల పంపిణీ పూర్తి చేశారు. తొలి విడతలో 3,002 మందికి, రెండో విడతలో 2,634 మందికి పట్టాలు అందజేశారు. ఈ రెండు విడతల్లో కలిపి సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన భూములకు ఉచితంగా శాశ్వత హక్కులు కల్పించారు. 

అటవీ, ఇరిగేషన్, రెవెన్యూ, దేవాదాయ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మంత్రి లోకేశ్ ఈ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తున్నారు.
Advertisement
Nara Lokesh
Andhra Pradesh House Pattas
Kunchanapalli Land Titles
Mana Illu Mana Lokesh
Mangalagiri Constituency Development
AP Housing Scheme Distribution

More Telugu News