అర్ధరాత్రి ఆలయంలో పెద్ద సౌండ్‌తో మ్యూజిక్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అల్లు శిరీష్!
- వినోభానగర్ హనుమాన్ ఆలయంలో అర్ధరాత్రి పెద్ద సౌండ్
- పెద్దలు, పిల్లలు నిద్రలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన
- గతంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వెల్లడి
- సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ పోలీసులకు విజ్ఞప్తి
సినీ నటుడు అల్లు శిరీష్ శబ్ద కాలుష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వినోభానగర్‌లోని ఓ ఆలయం నుంచి అర్ధరాత్రి వేళ కూడా పెద్ద శబ్దంతో సంగీతం వస్తుండటంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
తాను షేక్‌పేట్‌లోని అపర్ణా వన్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నానని, తమ నివాసానికి సమీపంలో ఉన్న వినోభానగర్ హనుమాన్ ఆలయంలో గత కొద్ది రోజులుగా రాత్రి 2, 3 గంటల వరకు కూడా పెద్ద శబ్దంతో సంగీతం పెడుతున్నారని అల్లు శిరీష్ తన 'ఎక్స్' పోస్టులో ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.
ఈ సమస్యపై తాను ఇప్పటికే ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని శిరీష్ తెలిపారు. అయితే, గణేష్ నిమజ్జనం వరకు సర్దుకుపోవాలని వారు సూచించినట్లు చెప్పారు. పండుగ ముగిసినప్పటికీ శబ్దాలు ఆగకపోవడంతో మరోసారి ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ పెద్ద శబ్దాల వల్ల తమ సొసైటీలోని వృద్ధులు, పిల్లలు, ఉద్యోగాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, దయచేసి ఈ విషయంపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులను ఆయన కోరారు.