బొట్టు పెట్టించుకున్న మమ్ముట్టి.. వివాదంపై గట్టిగా బదులిచ్చిన తోటి నటుడు!
- గుజరాత్ లో జాతీయ సినీ అవార్డుల ప్రదానోత్సవం
- మమ్ముట్టికి నుదుటన తిలకం దిద్ది స్వాగతం
- ముస్లిం అయివుండి తిలకం ఎలా దిద్దించుకున్నారంటూ విమర్శలు
- బావిలో కప్పలు అంట కౌంటర్ ఇచ్చిన హరిశ్రీ యూసు
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరోసారి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నిలవడం తెలిసిందే. ‘భ్రమయుగం’ చిత్రానికి గాను గుజరాత్‌లో జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అయితే, ఈ వేడుకలో ఆయనకు లభించిన స్వాగతంపై సోషల్ మీడియాలో అనూహ్యంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి నటుడు, దర్శకుడు హరిశ్రీ యూసుఫ్ గట్టిగా బదులిచ్చి మమ్ముట్టికి మద్దతుగా నిలిచారు.
అసలేం జరిగిందంటే..
అవార్డుల కార్యక్రమానికి హాజరైన మమ్ముట్టికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. తెల్ల చొక్కా, క్రీమ్ ప్యాంట్‌లో ఉన్న ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, నుదుట తిలకం (బొట్టు) దిద్దారు. అనంతరం త్రివర్ణ పతాకం రంగుల్లో ఉన్న వస్త్రాన్ని (థోర్తు) ఆయన భుజంపై కప్పారు. ఈ సమయంలో మమ్ముట్టి చిరునవ్వుతో ఆతిథ్యాన్ని స్వీకరించారు. దీనికి సంబంధించిన వీడియోను ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ అధికారిక పేజీలో షేర్ చేయగా, అది వైరల్ అయింది.
ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు మమ్ముట్టిపై విమర్శలు గుప్పించారు. ఆయన ముస్లిం మతస్థుడు కావడంతో, తిలకం దిద్దించుకోవడం మత విశ్వాసాలకు విరుద్ధమని కొందరు కామెంట్స్ చేశారు. ఈ చర్యపై ఆన్‌లైన్‌లో పెద్ద చర్చే జరిగింది.
అండగా నిలిచిన హరిశ్రీ యూసుఫ్
ఈ విమర్శలపై నటుడు హరిశ్రీ యూసుఫ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. మలయాళీలు చాలామంది మమ్ముట్టి అవార్డును సెలబ్రేట్ చేసుకుంటుంటే, కొద్దిమంది మాత్రం బొట్టు గురించే ఆలోచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శలు చేస్తున్న వారిని "బావిలో కప్పలు"గా అభివర్ణించారు. శిలువ వేసుకున్నా, బొట్టు పెట్టుకున్నా, నమాజ్ చేసినా.. అన్నీ సృష్టికర్తపై ప్రేమను చూపించే మార్గాలేనని ఆయన స్పష్టం చేశారు.
నుదుట బొట్టు పెట్టడం అనేది ఒకరిపై మతాన్ని రుద్దడం కాదని, అది అతిథులను గౌరవించే భారతీయ సంప్రదాయమని యూసుఫ్ వివరించారు. మతం అనేది మనుషులను మంచివారిగా మార్చాలి కానీ, వారి మధ్య విభేదాలు సృష్టించకూడదని హితవు పలికారు. ఇలాంటి సంకుచిత ధోరణులు ప్రమాదకరమని హెచ్చరించారు. దశాబ్దాలుగా మమ్ముట్టి చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలను, ముఖ్యంగా వైద్య రంగంలో ఆయన అందిస్తున్న సహాయాన్ని యూసుఫ్ గుర్తుచేశారు.