నవంబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు.. 37 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం: నాదెండ్ల మనోహర్
- విజయవాడలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వర్క్‌షాప్
- రాష్ట్ర వ్యాప్తంగా 2,619 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్న నాదెండ్ల
- ధాన్యం తరలించేందుకు 31 వేల వాహనాలను అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని నవంబర్ 1న ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో పౌరసరఫరాల శాఖ నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడిన ఆయన, రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు, రవాణా, మిల్లింగ్ ప్రక్రియకు సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2,619 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. సేకరణ ప్రక్రియ కోసం 24 వేల మంది సిబ్బందిని నియమించగా, కల్లాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించేందుకు 31 వేల వాహనాలను అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించారు. ఈసారి రైతులకు రవాణా ఖర్చులు కూడా చెల్లించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.
ఎల్‌నినో ప్రభావం కారణంగా పంట దిగుబడులు, తద్వారా ధాన్యం సేకరణ అంచనాలు తగ్గినట్లు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అయినప్పటికీ, రైతుల వద్ద ధాన్యం నిల్వ ఉండకుండా సకాలంలో కొనుగోలు చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ, రవాణా, గోనె సంచుల సరఫరా, మిల్లుల సామర్థ్యం, చెల్లింపుల ప్రక్రియ వంటి అంశాల్లో పౌరసరఫరాల శాఖతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేసేందుకే ఈ వర్క్‌షాప్ నిర్వహించినట్లు తెలిపారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన తర్వాత చెల్లింపులు ఆలస్యం కాకుండా ముందస్తు కార్యాచరణ అమలు చేయాలని చెప్పారు.