చిరు 'కాకా' అప్డేట్.. డబ్బింగ్ పనులు ప్రారంభం!
- డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం 'కాకా'
- పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులకు శ్రీకారం
- ఏకకాలంలో జరుగుతున్న షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు
- 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కాకా' నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించింది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్టు స్పష్టమవుతోంది.
ఈ చిత్రంలో చిరంజీవి 'కదిరి కాళిదాస్' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అనశ్వర రాజన్, నివేతా పేతురాజ్, కన్నడ నటి రచిత రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. సునీల్, గెటప్ శ్రీను ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, ఈ చిత్రాన్ని 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.