Advertisement

భారత్‌పై ఆంక్షలు వద్దు.. ప్రపంచ మార్కెట్లకు నష్టం: అమెరికాకు జేపీ మోర్గాన్ సీఈఓ సూచన

International
Advertisement
  • రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌ను శిక్షించవద్దు
  • అమెరికాకు జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జేమీ డైమన్ సూచన
  • టారిఫ్‌లు విధిస్తే ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్ల‌డి
  • ఏ చర్యలు తీసుకునే ముందైనా భారత్‌తో చర్చించాలని హితవు
  • భారత రిఫైనరీల అవసరాలను అమెరికా అర్థం చేసుకోవాలని వ్యాఖ్య
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న విషయంలో భారత్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని, శిక్షార్హమైన టారిఫ్‌లు విధించవద్దని అమెరికాకు ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జేమీ డైమన్ సూచించారు. ఈ విషయంలో తొందరపడి ఏకపక్షంగా ముందుకెళ్తే అది కేవలం భారత్‌కే కాకుండా యావత్ ప్రపంచ చమురు మార్కెట్లపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.

జేపీ మోర్గాన్ ఇండియా ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడారు. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుపై టారిఫ్‌లు విధించే ముందు, అమెరికా ప్రభుత్వం క్షుణ్ణంగా ఆలోచించాలని అన్నారు. భారత రిఫైనరీలు రష్యా చమురును ఎలా వినియోగిస్తున్నాయో, వాటి అవసరాలేమిటో వాషింగ్టన్ మొదట అర్థం చేసుకోవాలని హితవు పలికారు. భారత్‌పై ఆంక్షలు విధించే బదులు, అమెరికా అధికారులు ఢిల్లీతో కూర్చుని అన్ని వాస్తవాలను చర్చించాలని అభిప్రాయపడ్డారు.

"రష్యాతో పోరాడేందుకు మనం చేయాల్సినవి చేస్తూనే, భారత్‌ను, ప్రపంచ చమురు మార్కెట్లను శిక్షించకుండా అమెరికా వ్యవహరిస్తుందని నేను ఆశిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు. చమురుపై టారిఫ్‌లు విధించడం సరైన నిర్ణయమా కాదా అనే దానిపై తనకు పూర్తి స్పష్టత లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించేందుకు అధికారం కల్పిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ చట్టంపై సంతకం చేసిన నేపథ్యంలో డైమన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ చట్టం అమల్లోకి వస్తే భారత్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.

భారత రిఫైనరీలు ప్రాసెస్ చేస్తున్న రష్యా చమురుకు ప్రత్యామ్నాయాలను అంత సులభంగా కనుగొనలేకపోవచ్చని డైమన్ గుర్తుచేశారు. సరఫరాలో ఆకస్మిక మార్పులు చేస్తే అది భారత రిఫైనరీలకే కాకుండా విస్తృత ఇంధన మార్కెట్లకు కూడా నష్టం కలిగిస్తుందని వివరించారు. అనూహ్య పరిణామాలకు దారితీసే చర్యల కంటే, వాస్తవాలపై చర్చలు జరపడం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Jamie DimonJP Morgan ChaseIndia Russia oil importsUS sanctions on IndiaGlobal oil market impactDonald Trump oil tariffs

More Telugu News

బహిరంగంగా ప్రేమను ప్రదర్శించిందని మహిళకు కొరడా దెబ్బలు

12 Nov, 21:14

నిజంగా మహాలక్ష్మి.. ఆడపిల్ల పుట్టిన మరుసటి రోజే తండ్రికి రూ.1.5 కోట్ల లాటరీ!

12 Nov, 20:58

వాషింగ్టన్ లో కాల్పులు.. వైట్ హౌస్ సమీపంలో మరోసారి కలకలం

12 Nov, 20:44

సత్య నాదెళ్లను వెనక్కినెట్టి నెం.1గా సుందర్ పిచాయ్

12 Nov, 20:40

టెస్టు అరంగేట్రంలోనే 7 వికెట్లు.. శ్రీలంకపై సంచలనం సృష్టించిన పాక్ బౌలర్ సాకిబ్ ఖాన్

12 Nov, 20:15

ఖైత‌లాపూర్ చెరువుకు హైడ్రా ఫెన్సింగ్.. సమాధి రాయికి జేసీబీ తగలడంతో ఉద్రిక్తత

12 Nov, 19:51

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామా

12 Nov, 19:43

గూఢచర్యం నెపంతో టెక్నాలజీ దిగ్బంధం.. అమెరికాపై నిప్పులు చెరిగిన చైనా

12 Nov, 19:30

నకిలీ కోర్టు తీర్పులతో వెబ్‌సైట్ల బ్లాకింగ్.. దర్యాప్తు ప్రారంభించిన కేంద్రం

12 Nov, 19:18

హైదరాబాద్ వేదికగా మార్స్ జీసీసీ విస్తరణ.. జెన్‌పాక్ట్‌తో కీలక భాగస్వామ్యం

12 Nov, 19:06

విదేశీ టీ20 లీగ్‌లపై ఐసీసీ కొరడా.. కొత్త ఆంక్షలకు రంగం సిద్ధం!

12 Nov, 18:43

నీటిని తోడేస్తున్న ధనిక రైతులు.. రీచార్జ్ చేస్తున్న పేద రైతులు! రాయలసీమ భూగర్భ జలాలపై ఐఐఎస్సీ కీలక అధ్యయనం

12 Nov, 18:34

పాత కేసులో కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

12 Nov, 18:21

తెలంగాణాలో 21 మంది ఐపీఎస్ ల బదిలీలు.. వీసీ సజ్జనార్‌కు కొత్త పోస్టు

12 Nov, 17:58

ఎస్బీఐ లాకర్ తెరిచి చూస్తే అంతా ఖాళీ.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి షాక్

12 Nov, 17:41
..More Telugu News