ట్రామడాల్ ఇంజక్షన్‌లు తెగ వాడేస్తున్నారు.. ఏపీలో 100 మెడికల్ షాపులపై దాడులు!
- రాష్ట్రవ్యాప్తంగా ట్రామడాల్ ఇంజెక్షన్ల అమ్మకాలపై దాడులు
- 100 షాపులను తనిఖీ చేయగా 55 చోట్ల ఉల్లంఘనల గుర్తింపు
- జంగారెడ్డిగూడెంలో భారీ రాకెట్ వెలుగులోకి, ఐదుగురి అరెస్ట్
- ఒకే ఏజెన్సీ నుంచి 7,550 ఇంజెక్షన్ల స్వాధీనం
ఆంధ్రప్రదేశ్‌లో నొప్పి నివారణకు వినియోగించే 'ట్రామడాల్' ఇంజెక్షన్లను మత్తు పదార్థంగా అక్రమంగా విక్రయిస్తున్న ముఠాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 100 మెడికల్ షాపులు, ఏజెన్సీలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలను ఉల్లంఘించిన 55 సంస్థలను అధికారులు గుర్తించారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిధిలోని వేగవరం గ్రామంలో గల ఒక ఆయిల్ పామ్ తోటలో వాడేసిన ట్రామడాల్ ఇంజెక్షన్లు, సిరంజిలు పెద్ద ఎత్తున లభించడంతో ఈ దందా గుట్టురట్టయింది. ఈ ఆధారాలతో లోతైన దర్యాప్తు చేపట్టిన అధికారులు, భారీ స్థాయిలో అక్రమ విక్రయాలు జరుగుతున్నట్లు నిర్ధారించారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల ఫిర్యాదు మేరకు జంగారెడ్డిగూడెం పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో మెడికల్ షాపుల యజమానులు కూడా ఉండటం గమనార్హం. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ ఇలాంటి భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
విచారణలో భాగంగా జంగారెడ్డిగూడెంలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ ఈ ఏడాది సుమారు 20 వేల ఇంజెక్షన్లను కొనుగోలు చేసినట్లు, అయితే వాటికి సంబంధించిన అమ్మకాల రికార్డులను చూపడంలో విఫలమైనట్లు అధికారులు గుర్తించారు. నిందితుడి స్నేహితుడికి చెందిన వడ్రంగి షాపులో నిల్వ చేసిన 7,550 ఇంజెక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, డీ రూప పెద్దింటి అనే మరో ఏజెన్సీ 5,200 ఇంజెక్షన్లు కొనుగోలు చేసి, తెలంగాణలోని ఒక ఫార్మసీకి 3,930 ఇంజెక్షన్లను విక్రయించినట్లు నకిలీ బిల్లులు సృష్టించినట్లు దర్యాప్తులో తేలింది.
"అక్రమ రవాణా, అనధికారిక నిల్వ, సరైన రికార్డులు లేకుండా ట్రామడాల్ లేదా ఇతర నియంత్రిత ఔషధాలను విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు" అని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ అరుణ్ బాబు హెచ్చరించారు. ట్రామడాల్‌ను వైద్యుల సిఫార్సు లేకుండా అధిక మోతాదులో వినియోగిస్తే శ్వాసకోశ సమస్యలతో పాటు నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన సదరు ఏజెన్సీల లైసెన్సులను రద్దు చేసేందుకు డీసీఏ ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించింది.