నగరంలోకి దూరప్రాంత బస్సులకు 'నో' ఎంట్రీ.. హైదరాబాద్ శివార్లలో 4 టెర్మినళ్లు!
- హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ ప్రణాళిక
- నగరం నాలుగు దిక్కులా భారీ బస్ టెర్మినళ్ల ఏర్పాటు
- శివార్లకే పరిమితం కానున్న దూరప్రాంత, ప్రైవేట్ బస్సులు
- టెర్మినళ్ల నుంచి మెట్రో, ఎంఎంటీఎస్‌తో లాస్ట్ మైల్ కనెక్టివిటీ
- రవాణా వ్యవస్థ బలోపేతానికి 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఓ బృహత్ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. నగరంలోకి ప్రవేశించే దూరప్రాంత బస్సులను శివార్లకే పరిమితం చేసేలా నాలుగు దిక్కులా భారీ బస్ టెర్మినళ్లను నిర్మించాలని నిర్ణయించినట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో నగర ప్రజా రవాణా వ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయి.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం, శంషాబాద్, ఎల్బీ నగర్, ఘట్‌కేసర్‌లలో ఆధునిక టెర్మినళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు, అలాగే ఇతర జిల్లాల నుంచి వచ్చే సర్వీసులు ఇకపై నగరంలోకి ప్రవేశించకుండా ఈ టెర్మినళ్ల వద్దే తమ ప్రయాణాన్ని ముగిస్తాయి. అక్కడి నుంచి ప్రయాణికులను నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరవేసేందుకు పటిష్టమైన 'లాస్ట్-మైల్ కనెక్టివిటీ' ఏర్పాటు చేస్తారు.
ఈ టెర్మినళ్ల నుంచి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ సిటీ బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలను అనుసంధానించనున్నట్టు మంత్రి వివరించారు. ప్రభుత్వ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులను కూడా ఈ కొత్త నిబంధనల పరిధిలోకి తీసుకురానున్నారు. నిర్దేశిత టెర్మినళ్ల నుంచే అవి కూడా నడపాల్సి ఉంటుంది. టెర్మినళ్లను వినియోగించుకున్నందుకు ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి రుసుము వసూలు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఈ టెర్మినళ్ల నిర్మాణానికి అవసరమైన భూమిని కూడా గుర్తించామని, గాజులరామారంలో 100 ఎకరాలు, శంషాబాద్ వద్ద 150 ఎకరాల స్థలాన్ని పరిశీలిస్తున్నామని పొన్నం తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి చెప్పారు. ఈ టెర్మినల్ ఆధారిత వ్యవస్థతో నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.