శరత్‌చంద్ర రచనలు చదవండి.. యువతకు ప్రధాని పిలుపు

శరత్‌చంద్ర రచనలు చదవండి.. యువతకు ప్రధాని పిలుపు

PM Modi urges youth to read Sarat Chandra Chattopadhyay works
  • ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్‌చంద్రకు ప్రధాని మోదీ నివాళి
  • 150వ జయంతి సందర్భంగా రచయితను స్మరించుకున్న ప్రధాని
  • ఆయన రచనలు సామాజిక సంస్కరణ, మహిళా హక్కులకు అద్దం పట్టాయన్న మోదీ
ప్రముఖ బెంగాలీ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ 150వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ప్రధాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. శరత్‌చంద్ర సాహిత్య వైభవాన్ని, సామాజిక సంస్కరణల పట్ల ఆయనకున్న అంకితభావాన్ని స్మరించుకున్నారు.

శరత్‌చంద్ర రచనలు కేవలం బెంగాలీ భాషకే పరిమితం కాలేదని, దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయని ప్రధాని పేర్కొన్నారు. 19వ శతాబ్దపు భారతదేశాన్ని, ముఖ్యంగా గ్రామీణ బెంగాలీ సామాజిక పరిస్థితులను ఆయన తన రచనల్లో అత్యంత వాస్తవికతతో ఆవిష్కరించారని కొనియాడారు. నేటికీ ఆయన రచనలు విశేష ఆదరణ పొందడానికి ఇదే ప్రధాన కారణమని వెల్లడించారు.

కేవలం రచయితగానే కాకుండా, సామాజిక సంస్కరణలు, మహిళా హక్కులు, జాతీయవాదం పట్ల శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ ప్రదర్శించిన నిబద్ధత ఎంతో స్ఫూర్తిదాయకమని మోదీ ప్రశంసించారు. భావితరాల యువత ఆయన రచనలను మరింత ఎక్కువగా చదవాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
Advertisement
Sarat Chandra Chattopadhyay
Narendra Modi
Bengali Literature
150th Birth Anniversary
Social Reforms
Indian Youth

More Telugu News