‘మిస్టర్ సింగ్’ పోస్ట్‌పై దుమారం.. ట్రంప్‌కు భారత సంతతి ఎంపీల ఘాటు లేఖ
- ‘మిస్టర్ సింగ్’ పేరుతో సిక్కులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణ
- ఈ పోస్ట్ జాతి వివక్ష, దాడులను ప్రోత్సహించేలా ఉందని ఆందోళన
- దక్షిణాసియా వాసులపై పెరుగుతున్న విద్వేషాన్ని లేఖలో ప్రస్తావించిన ఎంపీలు
- విద్వేష వ్యాప్తిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్
సిక్కు సమాజాన్ని కించపరిచేలా అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టును నిరసిస్తూ భారత సంతతికి చెందిన ఐదుగురు డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. రాజా కృష్ణమూర్తి, శ్రీ థానేదార్, సుహాస్ సుబ్రమణ్యం, ప్రమీలా జయపాల్, అమి బెరా ఈ లేఖపై సంతకాలు చేశారు.
డీహెచ్‌ఎస్ ఇటీవల ఒక సోషల్ మీడియా పోస్ట్‌ను షేర్ చేసి, ఆ తర్వాత తొలగించింది. ఆ పోస్ట్‌లో గడ్డంతో ఉన్న ఒక వ్యక్తిని మిస్టర్ ‘సింగ్’ అని సంబోధిస్తూ, ‘మా రోడ్ల నుంచి వెళ్ళిపో’, నీ అంతట నువ్వుగా దేశం విడిచి వెళ్లు, లేదంటే పరిణామాలు ఎదుర్కో’ అని రాసుకొచ్చింది. ‘సింగ్’ అనే పేరు సిక్కు సమాజానికి ప్రతీకగా ఉన్నందున, ఇది నేరుగా సిక్కు అమెరికన్లను ప్రమాదకరమైన విదేశీయులుగా చిత్రీకరించడమేనని ఎంపీలు తమ లేఖలో ఆరోపించారు.
ఈ పోస్ట్, దానితో పాటు ప్రచారం చేసిన ఐస్ (ICE) టిప్‌లైన్ వంటివి సిక్కులు, దక్షిణాసియా వాసులు, శ్వేతజాతీయులు కాని డ్రైవర్లపై జాతి వివక్షను ప్రేరేపించే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో దక్షిణాసియా వాసులపై విద్వేషం పెరుగుతోందని, 2025లో 48 శాతం మంది దక్షిణాసియా వాసులు జాతి వివక్షను ఎదుర్కొన్నారని వారు తమ లేఖలో కొన్ని సర్వేల వివరాలను ప్రస్తావించారు. టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో చోటుచేసుకున్న ఘటనలను కూడా ఈ సందర్భంగా ఉదహరించారు.
ఈ పోస్ట్ కారణంగా జరిగిన నష్టాన్ని ప్రభుత్వం బహిరంగంగా అంగీకరించాలని, భవిష్యత్తులో అధికారిక ప్రకటనల్లో జాతి లేదా మతపరమైన పదాలను వాడకుండా కఠినమైన ప్రమాణాలను రూపొందించాలని వారు ట్రంప్‌ను డిమాండ్ చేశారు.