మా జుట్టు పట్టుకుని లాగారు: ఢిల్లీలో ఎన్‌హెచ్ఆర్సీకి సబితాఇంద్రారెడ్డి ఫిర్యాదు
- అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్
- మహిళా ఎమ్మెల్యేల జుట్టు పట్టుకుని లాగారని ఆరోపణ
- ఇది కుట్రలో భాగమేనని సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్య
- డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని ఆవేదన
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో తమపై జరిగిన దాడి జరిగిందని, అవమానరకరమైన ప్రవర్తన ఎదురైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను (ఎన్‌హెచ్ఆర్‌సీ) ఆశ్రయించింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలోని మహిళా ఎమ్మెల్యేల బృందం శుక్రవారం ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలు విజయభారతిని కలిసి ఫిర్యాదును అందజేసింది.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ వద్ద పోలీసులు తమ పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. "మహిళా ఎమ్మెల్యేల జుట్టు పట్టుకుని లాగుతూ పోలీసులు అరాచకం సృష్టించారు. ఇదంతా ఒక పథకం ప్రకారం, కుట్రలో భాగంగానే జరిగింది" అని ఆమె పేర్కొన్నారు. తమను రక్షించేందుకు ప్రయత్నించిన తోటి ఎమ్మెల్యేలను సైతం పోలీసులు తోసివేసి కిందపడేసి తొక్కారని, ఈ ఘటనలో జగదీశ్‌రెడ్డికి రక్తపోటు పెరిగిందని, పలువురు ప్రజాప్రతినిధులకు గాయాలయ్యాయని వివరించారు.
ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతోనే జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. అసెంబ్లీలోకి వెళ్లకుండా తమను అడ్డుకునే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో కోరారు.