తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుత.. భక్తుల భయాందోళన
- తిరుమల అలిపిరి నడకమార్గంలో మరోసారి చిరుత సంచారం
- 7వ మైలు వద్ద చిరుతను చూసి భయపడిన భక్తులు
- నరసింహస్వామి ఆలయం సమీపంలోనూ కనిపించినట్లు సమాచారం
- భక్తులను గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్న తితిదే
- నడకమార్గంలో భద్రతను పెంచి, నిఘా ఏర్పాటు చేసిన అధికారులు
తిరుమల శ్రీవారి దర్శనానికి పాదయాత్రగా వెళ్లే భక్తులను వన్యమృగాల భయం మరోసారి వెంటాడింది. అలిపిరి నడకమార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. మెట్ల మార్గంలో 7వ మైలు దాటిన తర్వాత మండపం సమీపంలో చిరుత కనిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు భయంతో కేకలు వేస్తూ వెనక్కి పరుగులు తీశారు.
రెండు రోజుల క్రితం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నరసింహస్వామి ఆలయానికి సమీపంలో చిరుత సంచరించినట్లు కొందరు భక్తులు తెలిపారు. తాజాగా 7వ మైలు వద్ద మరోసారి కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వరుస ఘటనలతో నడకమార్గంలో వెళ్లేందుకు భక్తులు జంకుతున్నారు. ముఖ్యంగా పిల్లలతో, వృద్ధులతో కలిసి ప్రయాణించే వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ సమాచారం అందిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నడకమార్గంలో కీలక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం భక్తులను ఒంటరిగా అనుమతించకుండా, గుంపులుగా మాత్రమే పంపిస్తున్నారు. చిరుత సంచరించినట్లు చెప్పిన ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ధైర్యంగా గుంపులుగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.
కాగా, తిరుమల నడకమార్గంలో చిరుతల సంచారం కొత్తేమీ కాదు. గతంలోనూ పలుమార్లు చిరుతలు, ఎలుగుబంట్లు కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురైన సంఘటనలు ఉన్నాయి. అప్పట్లో కూడా టీటీడీ ఇలాంటి భద్రతా చర్యలనే అమలు చేసింది.