సీఎంఆర్‌ఎల్ కేసు: ఈడీపై కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఫైర్

సీఎంఆర్‌ఎల్ కేసు: ఈడీపై కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఫైర్

Pinarayi Vijayan slams ED over CMRL bribery case allegations
  • సీఎంఆర్‌ఎల్ లంచం కేసులో ఈడీ తనను లక్ష్యంగా చేసుకుందన్న పినరయి విజయన్
  • ఈడీ తీరు సిగ్గుచేటుగా ఉందని కేరళ మాజీ సీఎం వ్యాఖ్య
  • కుమార్తె, అల్లుడిని లాగుతూ ఈడీ కొత్త నాటకం ఆడుతోందని విమర్శ
  • ఈ ఆరోపణలను రాజకీయంగా, చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టీకరణ
కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) ముడుపుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను లక్ష్యంగా చేసుకుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. బుధవారం జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈడీ వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యల వల్ల తన వ్యక్తిగత ప్రతిష్ఠకు గానీ, ప్రజల్లో తనపై ఉన్న గౌరవానికి గానీ ఎలాంటి భంగం వాటిల్లదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సీఎంఆర్‌ఎల్ నుంచి తాను రూ. 3.8 కోట్లు లంచం తీసుకున్నట్లు ఈడీ వర్గాల సమాచారమంటూ వస్తున్న మీడియా కథనాలతో, కేరళ ప్రజల దృష్టిలో తనను అవినీతిపరుడిగా చిత్రీకరించగలరా అని ఆయన ప్రశ్నించారు. ఈడీ తాజాగా మరో కొత్త నాటకానికి తెరతీసిందని విజయన్ ఆరోపించారు.

సీఎంఆర్‌ఎల్ ఆ నగదును తన కుమార్తె వీణా టీ ద్వారా తనకు అందజేసిందని, ఆ తర్వాత ఆమె తన భర్త, మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ సహాయంతో వాటిని విదేశాలకు తరలించిందని ఈడీ కట్టుకథలు అల్లుతోందని ఆయన విమర్శించారు. రాజకీయ ప్రేరేపితమైన ఇటువంటి చర్యలను రాజకీయంగా, చట్టపరంగా దీటుగా ఎదుర్కొంటామని పినరయి విజయన్ స్పష్టం చేశారు.
Advertisement
Pinarayi Vijayan
CMRL bribery case
Enforcement Directorate
Veena Vijayan
Mohammed Riyas
Kerala corruption investigation

More Telugu News