ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కుట్ర.. కేసీఆర్‌పై అసెంబ్లీలో రేవంత్‌ ఆరోపణలు

09-09-2026 Wed 17:24 | Telangana
Advertisement
  • స్పీకర్‌ను దూషించడంపై రేవంత్‌ ఆగ్రహం
  • ప్రజాసమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని వెల్లడి
  • బీఆర్‌ఎస్‌ సభ్యులను ఉసిగొలిపారని విమర్శ
  • స్పీకర్‌కు కేసీఆర్‌ క్షమాపణ చెప్పలేదని వ్యాఖ్య
Advertisement
అసెంబ్లీ స్పీకర్‌ను దూషించిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్పీకర్‌పై మాటల దాడికి పాల్పడటం పార్లమెంట్‌, ముంబయి, పుల్వామా దాడులతో సమానమని వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలపై చర్చ జరగకుండా అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కుట్రకు తెరతీశారని ఆరోపించారు.

శాసనసభలో బుధవారం మాట్లాడిన సీఎం.. స్పీకర్‌ స్థానాన్ని, ఆయన తల్లిని అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్పీకర్‌ను దూషించిన ఘటనను సభ్యులంతా ముక్తకంఠంతో ఖండించారని తెలిపారు. ఇలాంటి ఘటన తర్వాత కేసీఆర్‌ స్వయంగా స్పీకర్‌తో మాట్లాడి క్షమాపణలు చెబుతారని ప్రజాస్వామ్యవాదులు భావించారని అన్నారు. కానీ కేసీఆర్‌ అలా చేయలేదని విమర్శించారు.

ప్రజాసమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ సమస్యలు చర్చకు వస్తే తమ గుట్టు రట్టవుతుందనే భయంతోనే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ కుట్రకు తెరతీశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ సభ్యులను ఉసిగొలిపి సభకు పంపించారని మండిపడ్డారు.

ఎక్కడైతే ఈ కుట్రకు తెరలేచిందని ఆరోపించారో.. అదే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి డప్పులు వాయించేందుకు ప్రయత్నిస్తే అక్కడ శుద్ధీకరణ చేశారని రేవంత్‌ అన్నారు. ఉత్తరాఖండ్‌లో ఖర్గే నిరసనలో పాల్గొన్న మైదానాన్ని శ్రీరామసేన శుద్ధీకరణ చేసిందని గుర్తుచేశారు. ఇలాంటి దురదృష్టకర ఘటన తెలంగాణలోనూ చోటుచేసుకుందని వ్యాఖ్యానించారు.

స్పీకర్‌ స్థానాన్ని అవమానించడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని సీఎం పేర్కొన్నారు. సభలో సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజాసమస్యలపై చర్చకు సహకరించాలని కోరారు.
Advertisement
Revanth ReddyK Chandrashekar RaoErravalli FarmhouseBRS PartyTelangana AssemblySpeaker Insult Controversy

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more