తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్‌సీపై ప్రభుత్వం కీలక అడుగు

09-09-2026 Wed 15:41 | Telangana
Advertisement
  • పీఆర్‌సీ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కీలక అడుగు
  • నివేదిక త్వరగా ఇవ్వాలని పీఆర్‌సీ ఛైర్మన్‌కు సీఎస్‌ లేఖ
  • రెండో పీఆర్‌సీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో నిర్ణయం
  • బకాయి డీఏల విడుదలపై ఉద్యోగుల నుంచి డిమాండ్లు
  • ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల ఒత్తిడి
Advertisement
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్య చేపట్టింది. 2వ వేతన సవరణ కమిషన్‌ (పీఆర్‌సీ) నివేదికను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. ఈ మేరకు రెండో పీఆర్సీ ఛైర్మన్‌ ఎన్‌. శివశంకర్‌కు లేఖ రాశారు.

గతంలో నియమించిన రెండో వేతన సవరణ కమిషన్‌ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పీఆర్‌సీ అమలుపై ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. బకాయి ఉన్న డీఏలు విడుదల చేయాలని, పీఆర్‌సీ నివేదిక ఆధారంగా ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ అంశాలపై ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పీఆర్‌సీ కమిషన్‌ వేగంగా నివేదిక సమర్పిస్తే.. దాని ఆధారంగా ఉద్యోగుల వేతన సవరణపై తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

కమిషన్‌ నివేదిక అందిన తర్వాత ఫిట్‌మెంట్‌, వేతన సవరణకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పీఆర్‌సీ ప్రక్రియపై ఉద్యోగుల్లో మరోసారి ఆశలు నెలకొన్నాయి.
Advertisement
Telangana GovernmentTelangana PRC2nd Pay Revision CommissionTelangana Government Employees Salary HikeN Sivashankar PRC ChairmanTelangana DA Arrears

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more