అన్నవరంలో భక్తుడిని మోసం చేసిన వ్యాపారికి భారీ షాక్

09-09-2026 Wed 07:40 | Andhra
Advertisement
  • అన్నవరంలో వాటర్ బాటిల్‌పై రూ.7 అధిక వసూలు
  • వినియోగదారుల ఫోరంలో భక్తుడి ఫిర్యాదు
  • షాపు యజమానికి రూ.7 లక్షల భారీ జరిమానా
  • వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశం
Advertisement
అన్నవరం దేవస్థానం ప్రాంగణంలోని ఓ శీతలపానీయాల దుకాణదారుడికి వినియోగదారుల ఫోరం భారీ షాక్ ఇచ్చింది. కేవలం ఏడు రూపాయల అదనపు వసూళ్ల కోసం ఆశపడి, ఏకంగా ఏడు లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సిన పరిస్థితిని కొనితెచ్చుకున్నాడు. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు వాటర్ బాటిల్ విక్రయించినందుకు గాను కాకినాడ వినియోగదారుల ఫోరం ఈ సంచలన తీర్పును వెలువరించింది.

వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 22న పిఠాపురానికి చెందిన వెంకటేశ్వరరావు అనే భక్తుడు అన్నవరం ఆలయ ప్రాంగణంలోని ఒక దుకాణంలో వాటర్ బాటిల్ కొనుగోలు చేశారు. దాని ఎమ్మార్పీ ధర రూ.18 కాగా, సదరు దుకాణదారుడు రూ.25 వసూలు చేశాడు. అదనంగా రూ.7 వసూలు చేసి వినియోగదారుడిని మోసగించినందుకు గాను వెంకటేశ్వరరావు కాకినాడ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఫోరం మంగళవారం తుది తీర్పును వెల్లడించింది. ఫోరం అధ్యక్షులు రఘుపతి వసంత్ కుమార్, సభ్యులు శశి, నాగేశ్వరరావులతో కూడిన బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. భక్తుడి నుంచి అదనంగా వసూలు చేసిన రూ.7ను తిరిగి చెల్లించడంతో పాటు, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది. వీటితో పాటు, వినియోగదారుల సంక్షేమ నిధికి ఏకంగా రూ.7 లక్షలను జరిమానాగా జమ చేయాలని తీర్పులో స్పష్టం చేసింది. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు వస్తువులను విక్రయించే వ్యాపారులకు ఈ తీర్పు ఒక గట్టి హెచ్చరికగా నిలుస్తోంది.
Advertisement
Annavaram ShopkeeperKakinada Consumer ForumMRP Violation PenaltyWater Bottle Overcharging CaseConsumer Rights Andhra PradeshAnnavaram Temple News

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more