పాక్‌కు గట్టి సంకేతం.. సింధు నదిపై భారత్ కొత్త ప్లాన్!
- సింధు నదిపై భారత్ తొలి రాక్ చెక్ డ్యామ్
- లడఖ్ లోని ఉప్షి వద్ద నిర్మాణం
- దాదాపు 10 అడుగులు పెరిగిన నీటి మట్టం
- డ్యామ్‌లో 4 కోట్ల లీటర్ల నీటి నిల్వ
- ఇగూ ఫే కాలువ ద్వారా పొలాలకు నీరు
లడఖ్‌లో నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు భారత్ ఊరటనిచ్చింది. సింధు నదిపై దేశంలోనే తొలి రాక్ చెక్ డ్యామ్‌ను నిర్మించింది. లేహ్‌లోని ఉప్షి వద్ద నిర్మించిన ఈ డ్యామ్ వల్ల నదిలో నీటి మట్టం దాదాపు 10 అడుగులు పెరిగింది. దీంతో వసంతకాలంలో సాగుకు నీరు అందక ఇబ్బంది పడుతున్న గ్రామాల పొలాలకు నీటిని మళ్లించే అవకాశం ఏర్పడింది.
ఈ డ్యామ్‌ను సిమెంట్ ఉపయోగించకుండా పూర్తిగా సహజమైన పెద్ద రాళ్లతో నిర్మించారు. ఇందులో దాదాపు 4 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేయవచ్చు. ఈ నీటిని ఇగూ ఫే సాగునీటి కాలువ ద్వారా పొలాలకు అందిస్తున్నారు.
ఇప్పటివరకు లడఖ్‌లోని పలు ప్రాంతాల్లో సింధు నది లోతైన లోయల మధ్య తక్కువ స్థాయిలో ప్రవహించేది. దీంతో వసంతకాలంలో పంపుల ద్వారా నీటిని తీసుకోవడం రైతులకు సాధ్యమయ్యేది కాదు. ఫలితంగా సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఉప్షి వద్ద నిర్మించిన చెక్ డ్యామ్ స్థానిక వ్యవసాయానికి ఉపయోగపడటంతో పాటు వ్యూహాత్మకంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన పరిస్థితుల్లో సరిహద్దు ప్రాంతాల్లో నదీ జలాలను వినియోగించుకునేందుకు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామనే సంకేతాన్ని ఈ ప్రాజెక్టు ఇస్తోంది.
లడఖ్ పాలన యంత్రాంగం ఇలాంటి మరిన్ని చెక్ డ్యామ్‌ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు 36 ప్రాజెక్టులతో ప్రతిపాదన పంపింది. ఇందులో లేహ్ ప్రాంతంలో 7 హిమాలయన్ రాక్ చెక్ డ్యామ్‌లు, కార్గిల్‌లో 29 చెక్ డ్యామ్‌లు ఉన్నాయి. వీటి అంచనా వ్యయం రూ.56 కోట్లకు పైగానే ఉంది.