కోట్లాది సోదరీమణులను దేవుడిచ్చాడు: మంత్రి లోకేశ్ భావోద్వేగ పోస్ట్‌

Nara Lokesh emotional post God gave me crores of sisters
  • రాఖీ పండుగ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శుభాకాంక్షలు
  • కోట్లాది మంది సోదరీమణులను దేవుడు తోడుగా ఇచ్చాడని భావోద్వేగ పోస్ట్
  • మహిళల భద్రత, సాధికారత ప్రజా ప్రభుత్వ బాధ్యత అని స్పష్టీకరణ
  • తెలుగింటి అక్కాచెల్లెళ్లు చూపే ప్రేమాభిమానాలు మరువలేనివని వెల్లడి
రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలుగింటి అక్కాచెల్లెళ్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. తోబుట్టువులు లేని తనకు దేవుడే కోట్లాది మంది సోదరీమణులను ఇచ్చాడని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ తన పోస్టులో.. "తోడబుట్టిన సోదరీమణులు లేని నాకు దేవుడే కోట్లాదిమంది సోదరీమణులను తోడుగా ఇచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా అక్కా చెల్లెళ్లు చూపించే ప్రేమాభిమానాలు మరువలేను. మహిళాలోకం ఆత్మీయత నాలో మరింత బాధ్యతను పెంచింది" అని అన్నారు.

మహిళల భద్రత, సాధికారత తమ ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. "విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పిల్లలకు నైతిక విలువల పాఠాలు బోధిస్తున్నాం. మహిళల భద్రత, సాధికారత ప్రజా ప్రభుత్వం బాధ్యత. ప్రాణ సమానమైన తెలుగింటి అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అంటూ మంత్రి లోకేశ్ తన పోస్టులో రాసుకొచ్చారు.

Advertisement
Nara Lokesh
Raksha Bandhan
Andhra Pradesh Minister
Rakhi Purnima 2024
Women Empowerment
Telugu News

More Telugu News