చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు!
- గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ విజేతగా ప్రజ్ఞానంద
- ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డ్
- ఫ్యాబియానో కరువానాపై అద్భుతమైన పునరాగమనం
- టైటిల్‌తో పాటు 2 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ కైవసం
భారత యువ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద చదరంగంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను తొలిసారిగా కైవసం చేసుకున్నాడు. అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ 2 ఫ్యాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించాడు. ఈ విజయంతో ఈ టోర్నీని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ ఆటగాడిగా ప్రజ్ఞానంద రికార్డు సృష్టించాడు.
నిన్న జరిగిన చివరి రోజు ఆటలో ప్రజ్ఞానంద అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించాడు. ఆట ప్రారంభానికి ముందు కరువానా కంటే ఆరు పాయింట్లు వెనుకబడి ఉన్న ప్రజ్ఞానంద, రెండు ర్యాపిడ్ గేమ్‌లలోనూ గెలిచి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత జరిగిన బ్లిట్జ్ గేమ్‌లలోనూ సమంగా నిలిచి, మొత్తం మీద 15-13 స్కోర్‌తో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన ప్రజ్ఞానందకు 2 లక్షల డాలర్ల (సుమారు రూ. 1.91 కోట్లు) ప్రైజ్ మనీ లభించింది.
వాస్తవానికి ఈ టోర్నీ ఆరంభంలో కరువానా చేతిలో తొలి క్లాసికల్ గేమ్‌లో ప్రజ్ఞానంద ఓడిపోయాడు. రెండో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో చివరి రోజు ఆటలో వెనుకబడినప్పటికీ, అద్భుత ప్రదర్శనతో విజయాన్ని అందుకున్నాడు. ఇదే టోర్నీలో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో జీఎం వెస్లీ సో, విన్సెంట్ కైమర్‌పై విజయం సాధించాడు.