టాక్సిక్‌ వసూళ్లు: మొదటి రోజు మోత.. రెండో రోజే భారీ షాక్‌!

Toxic Collections Roar on Day 1 and Heavy Shock on Day 2
  • ‘టాక్సిక్‌’ రెండో రోజు రూ.36.40 కోట్ల నెట్‌ వసూళ్లు
  • తొలి రోజు రూ.101.10 కోట్లతో భారీ ఓపెనింగ్‌
  • రెండు రోజుల్లో రూ.190.75 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్‌
  • రెండో రోజు వసూళ్లలో హిందీ వెర్షన్‌ ముందంజ
  • ‘ధురంధర్‌ 2’, ‘పుష్ప 2’ కంటే వెనుకబడిన ‘టాక్సిక్‌’
యశ్ నటించిన భారీ బడ్జెట్‌ గ్యాంగ్‌స్టర్‌ చిత్రం ‘టాక్సిక్‌’ బాక్సాఫీస్‌ వద్ద రెండో రోజు భారీగా వెనకడుగు వేసింది. తొలి రోజు రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్లిన ఈ సినిమా.. రెండో రోజు మాత్రం గణనీయంగా తగ్గింది. ‘ధురంధర్‌ 2’, ‘పుష్ప 2’, ‘కేజీఎఫ్‌ 2’ వంటి భారీ చిత్రాల రెండో రోజు వసూళ్ల స్థాయిని అందుకోలేకపోయింది.

ఆగస్టు 26న విడుదలైన ‘టాక్సిక్‌’ తొలి రోజు దేశీయంగా రూ.101.10 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. రెండో రోజు రూ.36.40 కోట్లకే పరిమితమైంది. తొలి రెండు రోజుల్లో దేశీయంగా రూ.137.50 కోట్ల నెట్‌, రూ.164.50 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది.

విదేశాల్లో రెండో రోజు రూ.10 కోట్లు రాబట్టింది. దీంతో ఓవర్సీస్‌ గ్రాస్‌ రూ.26.25 కోట్లకు చేరింది. రెండు రోజుల ప్రపంచవ్యాప్త గ్రాస్‌ వసూళ్లు రూ.190.75 కోట్లుగా నమోదయ్యాయి.

రెండో రోజు వసూళ్లలో హిందీ వెర్షన్‌ రూ.23 కోట్లు రాబట్టి ముందంజలో నిలిచింది. కన్నడ వెర్షన్‌ రూ.8.50 కోట్లు, తెలుగు వెర్షన్‌ రూ.3 కోట్లు వసూలు చేశాయి. తమిళంలో రూ.1.50 కోట్లు, మలయాళంలో రూ.40 లక్షలు వచ్చాయి.

అయితే ‘ధురంధర్‌ 2’ రెండో రోజు రూ.80.72 కోట్లు, ‘పుష్ప 2’ రూ.93.80 కోట్లు, ‘కేజీఎఫ్‌ 2’ రూ.90.50 కోట్లు వసూలు చేశాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రెండో రోజు రూ.86.70 కోట్ల నెట్‌ సాధించింది. ఈ చిత్రాలతో పోలిస్తే ‘టాక్సిక్‌’ రెండో రోజు జోరు బాగా తగ్గింది.

మిశ్రమ స్పందన మధ్య విడుదలైన ఈ సినిమా వారాంతంలో పుంజుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు.
Advertisement
Yash
Toxic Movie Box Office
Toxic Day 2 Collections
Geetu Mohandas
Toxic Worldwide Collection
Toxic Movie Review

More Telugu News