హైదరాబాద్ నడిబొడ్డున 50 అంతస్తుల ఆకాశహర్మ్యాలు.. ఏఎస్‌బీఎల్ ‘లెగసీ’ ప్రారంభం
- హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ‘ఏఎస్‌బీఎల్ లెగసీ’ ప్రాజెక్టు ప్రారంభం
- సుమారు 8 ఎకరాల్లో 50 అంతస్తులతో మూడు భారీ టవర్ల నిర్మాణం
- 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్లు.. ప్రారంభ ధర రూ. 1.99 కోట్లు
- ప్రాజెక్టులో 73 శాతం పైగా ఓపెన్ స్పేస్, 50కి పైగా సదుపాయాలు
- సెంట్రల్ హైదరాబాద్‌లో సరికొత్త జీవనశైలిని పరిచయం చేయడమే లక్ష్యం
హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో ఓ భారీ నివాస ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏఎస్‌బీఎల్, ‘ఏఎస్‌బీఎల్ లెగసీ’ పేరుతో విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును ప్రారంభించింది. నల్లకుంట - విద్యానగర్ ప్రధాన రహదారిలో సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇందులో భాగంగా 50 అంతస్తులతో కూడిన మూడు భారీ నివాస టవర్లు రూపుదిద్దుకోనున్నాయి.
ఈ ప్రాజెక్టులో విశాలమైన 3, 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రారంభ ధరను రూ. 1.99 కోట్లుగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు 2026 జులై 28న హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు లభించగా, 2031 జులై 28 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. సుమారు 36.1 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
ప్రాజెక్టులో 73.25 శాతం స్థలాన్ని ఖాళీగా (ఓపెన్ స్పేస్) వదిలేస్తుండటం విశేషం. నివాసితుల కోసం 74,000 చదరపు అడుగుల క్లబ్‌హౌస్, టెర్రస్ స్విమ్మింగ్ పూల్‌తో పాటు 50కి పైగా అత్యాధునిక వసతులను కల్పిస్తున్నారు. వీటిలో బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, ఫుట్‌సాల్ కోర్టులు, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ వంటి క్రీడా సదుపాయాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా ఏఎస్‌బీఎల్ వ్యవస్థాపకుడు, సీఈఓ అజితేష్ కొరుపొలు మాట్లాడుతూ.. సెంట్రల్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి ఇంకా విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా విడివిడి భవనాలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో నివాసితులకు పూర్తిస్థాయి గేటెడ్ కమ్యూనిటీ అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని వివరించారు. ఈ ప్రాజెక్టు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెట్రో స్టేషన్‌కు 2 నిమిషాల్లో, కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 8 నిమిషాల్లో చేరుకోవచ్చు.